-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-నగర మేయర్ తో కలిసి రూ. 39.96 లక్షలతో నిర్మించిన రహదారులు, డ్రెయిన్ల ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నగరంలో రోడ్ల పునరుద్ధరణ పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో శరవేగంగా జరుగుతున్నాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 61 వ డివిజన్ ప్రగతినగర్లో రూ. 39.96 లక్షలతో నిర్మించిన నూతన రహదారులు, డ్రెయిన్లను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావుతో కలిసి బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. కానీ సీఎం వైఎస్ జగన్ పాలనలో నగరం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. ప్రధానంగా రోడ్ల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను సైతం ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు రహదారులు ఏలా ఉండేవి..? ప్రస్తుతం అభివృద్ధి చేసిన రోడ్లు ఎలా ఉన్నాయి..? అన్నది ప్రజలకు తెలియజెప్పేలా నాడు–నేడు ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను చూసి అయినా గత పాలకులు సిగ్గుతెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని.. ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా తామంతా పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత నాలుగేళ్ల కాలంలో డివిజన్లో చేపట్టిన రూ.15.49 కోట్ల విలువైన పనులే ఇందుకు నిదర్శనమన్నారు. రూ. 69 లక్షలతో హెచ్ బ్లాక్ లో రహదారులు, రూ.93 లక్షలతో ప్రశాంతి నగర్లో నూతన రోడ్లను నిర్మించుకున్నట్లు తెలిపారు. గత తెలుగుదేశం హయాంలో పాయకాపురం చెరువు ఆక్రమణలకు గురికాగా.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తొలగించి పార్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రూ. 2.37 కోట్ల నిధులతో వైఎస్సార్ పార్కును సుందరీకరించడంతో పాటుగా రూ.83 లక్షలతో ప్రహరీని నిర్మించి పార్కును పరిరక్షించనున్నట్లు తెలిపారు. అలాగే రూ.84.35 లక్షలతో చేపట్టిన శాంతి నగర్ ప్రధాన రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. హెచ్ బ్లాక్ లో రూ. 70 లక్షలతో చేపట్టిన సచివాలయ భవన నిర్మాణం., రూ. 15.35 లక్షలతో చేపట్టిన శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 2 కోట్ల ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 80 లక్షలతో గాళ్ల వెంకయ్యకాలనీలో నూతన రోడ్లను నిర్మించనున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. ఇప్పటికే టెండర్లు పూర్తికాగా త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నగరం పూర్తిగా కళ తప్పిందన్నారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ. వందల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి దక్షతకు అద్దం పడుతుందని రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ అరుణ్ కుమార్, నాయకులు ఉమ్మడి వెంకట్రావు, నాలం బాబు, ఆర్.ఎస్.నాయుడు, వెంకటేశ్వరరావు, అనిల్ కుమార్, వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News