విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలకతీతంగా ఓట్లతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల సమాభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్ 18వ సచివాలయం పరిధిలోని బోస్ గారి కొండప్రాంతం, క్రీస్తురాజపురం కొండప్రాంతంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాన్ని అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా కొండ చివరంచున ఉన్న ఇంటి దాకా వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి సవివరంగా వివరించి ఆశీర్వదించమని కోరడం జరిగిందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మా కొండ ప్రాంతావాసుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన పట్టించుకోలేదని, మీకు అభివృద్ధి చేసిన మీరు మాకు ఓట్లు వెయ్యారు కదా అని చులకన గా మాట్లాడారని , కానీ నేడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మా ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించారని స్థానికులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఈ ప్రాంతావాసుల మంచినీటి కష్టాలు తొలగేలా దాదాపు 5కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ అంబెడ్కర్, డివిజన్ అధ్యక్షులు మట్ట ప్రసాద్ వైస్సార్సీపీ నాయకులు విటల్,లోకేష్ లామ్ కిరణ్,రమేష్,సోజన్య,షకీల తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News