విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్న వయస్సులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని కొన్ని నెలల పాటు జైల్లో గడిపిన ఉద్యమకారుడు గౌతు లచ్చన్న అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాష్ అన్నారు. అంటరానితనం పై కత్తి ఝళి పించిన సర్దార్ గౌతులచ్చన్న హరిజనులకు దేవాలయం ప్రవేశం, విద్యాభివృద్ధికి విశేషమైన కృషి చేశారని కొనియాడారు. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా పటమట ఎన్.యస్.ఎమ్ స్కూల్ వద్ద రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పాల్గొని లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదనంతరం సీనియర్ సిటిజన్ అసోసియేషన్ 17 మందిని శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని పిలిపించుకున్న వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు. ఇచ్చాపురం నుండి తడ వరకు 2400 కిలోమీటర్లు జమీందారీ,ఇనాం వ్యవస్థల రద్దు కోసం సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. ఐదుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి శాసనమండలి సభ్యుడిగా సుదీర్ఘకాలం చట్టసభల్లో ప్రజా గొంతుకై ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. బీసీల అభివృద్ధి కోసం క్రషి చేశారన్నారు. లచ్చన ఆదర్శాలను అమలుచేసే దిశగా సీఎం జగన్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరావు 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,వైసీపీ నాయకులు సన్నీ,శెటికం దుర్గాప్రసాద్,సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నాగేశ్వరావు,గోపాల్రావు,వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News