Breaking News

మే 14న ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ మహాసభ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశం మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే గౌరవసలహాదారులు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సుదీర్ఘమైన అంశాలపై, గత నాలుగేళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన విషయాలపై చర్చించి పలు తీర్మానాలు చేయడం జరిగింది. మే 14వ తేదీ మహాసభ నిర్వహిం చాలని తొలి తీర్మానం చేసారు. అనంతరం జర్నలిస్టుల అక్రిడిటేషన్స్ రెన్వూవల్స్ ని ఆన్లైన్ నమోదు నుంచి మినహాయించి సరళతరం చేయాలని అలాగే జర్నలిస్టుల ప్రొవిన్షియల్ కమిటీలను పునరుద్ధరించాలని, ప్రెస్ అకాడమి పాలక వర్గాన్ని నియమించాలని, చిన్నపత్రికల జర్నలిస్టులకు భేషరతుగా అక్రిడిటేషన్ మంజూరు చేయాలని కోరుతూ తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జయరాజ్, విజయవాడ యూనిట్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్ వసంత్, ఐజేయూ కౌన్సిల్ మెంబరు ఎస్కే బాబు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, రాష్ట్ర ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ సాంబశివరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, నగర అధ్యక్షులు ఎంవీ సుబ్బారావులతో పాటు విజయవాడ యూనిట్ కార్యవర్గ సభ్యులు, ప్రెస్ క్లబ్‌ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *