Breaking News

మొహమ్మద్‌ ఫతావుల్లా ఆధ్వర్యంలో పేద ముస్లిం లకు రంజాన్‌ తోఫా పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు మొహమ్మద్‌ ఫతావుల్లా ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్‌ ను పురస్కరించుకొని పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. బుధవారం గణపతి రావు రోడ్డు, ఇస్లాంపేట, ఖిద్మత్‌ ఘర్‌ ( ముహమ్మద్‌ ఫతావుల్లా కార్యాలయం)లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా నాయకులు కేశినేని శివనాద్‌ (చిన్ని), మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌ మీరా పాల్గొని ముస్లిం సోదరులందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. కటినమైన ఉపవాస దీక్షలు వలన మంచి ఫలితాల ను పొందుతారని, ఎదుటివారి ఆకలి విలువ తెలుసుకోగలిగెలా అందరూ సమానం అన్న  సమానత్వం  వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రంజాన్ నెలలో సంపాదనా పరులైన వారు వారి శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యాలని బోధిచడం ద్వారా మానవీయ విలువలు ప్రాధాన్యత ను చాటి చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. ముస్లిం మతం  సంపన్నులైనవారు రంజాన్ నెలలో ‘జకాత్ ‘ అచరించాలని ఖురాన్ బోధిస్తోందన్నారు.  ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని ‘జకాత్’ అని ఇది  పేదల ఆర్థిక హక్కుగా ఖురాన్ లో  పేర్కొంటారన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘రంజాన్ మాసం’ అని అన్నారు. ధనికుడు, పేదవాడనే తారతమ్యం లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రమైన ఈ రంజాన్ పండుగ వేడుకలను ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టతో చేస్తున్న ముస్లిం సోదరులందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలన్నారు. ముస్లిం మత పెద్దలు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *