Breaking News

గ్లోబల్ ఫుడ్ బాస్కెట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్లోబల్ ఫుడ్ బాస్కెట్ (GFB-2023) రెండవ రోజున ముఖ్య అతిధిగా కేంద్ర ఆహార శుద్ధి మరియు జల శక్తి మంత్రివర్యులు శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు విచ్చెసి తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు.వారి ప్రసంగంలో చిరు ధాన్యాల ఉపయోగాలు భారత దేశ ప్రభుత్వం అందిస్తున్న పధకాల గురుంచి ప్రస్తావిస్తూ తమ సహకారాలను ఎప్పటికి పారిశ్రామికవేత్తలకు మరియు నూతనముగా పరిశ్రమలను స్థాపించాలని అనుకునే వారికి అందుస్తామని అభయమిచ్చారు..అలాగే మత్యశాఖ నుండి అధికారులు ,వివిధ విశ్వవిద్యాలయాల నుండి ప్రముఖ ప్రభుత్వ శాస్త్రవేత్తలు వచ్చి తమ పరిజ్ఞానాన్ని అందించి తమ అమూల్యమైన సూచనలు,పద్ధతులు తెలియజేసారు. ఈ కార్యక్రమములో వివిధ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వచ్చి తమ ఉత్పత్తులు ప్రదర్శించారు..ఇందులో అనేక మంది అధికారులు,విద్యావేత్తలు, ఆహార రంగ పరిశ్రమలు స్థాపించాలని ఉద్దేశం కలిగిన వారు ఆహార రంగ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.ఆంధ్ర రాష్ట్రంలో ఆహార రంగంలో అంతర్జాతీయ సదస్సును ప్రప్రదముగా ఏర్పాటు చేసిన ఘనత MSMECC మరియు WASME లకు దక్కుతుంది.ఈ సదస్సును జయప్రదం చేసిన వారందరికీ MSMECC ధన్యవాదాలు తెలుపుకుంటోందని ఆ సంస్థ ప్రతినిధులు చైర్మన్ దేవరాజ్ గారు మరియు ప్రసిడెంట్ కిరణ్ కుమార్ గారు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *