-ఆదివారం రాత్రి 12 గంటల వరకు పని చేయనున్న క్యాష్ కౌంటర్లు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్తి, ఖాళీ స్థల పన్నును ఏక మొత్తంగా చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీకి ఆదివారం ఒక్కరోజే గడువు ఉందని, నగర ప్రజల సౌకర్యార్ధం గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో క్యాష్ కౌంటర్లు రాత్రి 12 గంటల వరకు పని చేస్తాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీకి నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, ఇప్పటికే ముందస్తు పన్ను చెల్లింపు ద్వారా రూ.45 కోట్లు పన్ను వసూళ్లు జరిగిందన్నారు. ఈ నెల 30లోపు ఏక మొత్తంగా ఆస్తి, ఖాలీ స్థల పన్ను చెల్లించి పన్ను రాయితీని వినియోగించుకోవాలని కోరారు. పన్ను చెల్లింపుకు భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లో క్యాష్ కౌంటర్లు ఆదివారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News