Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకోసం సి.ఆర్ ఎపి మీడియా ఆధ్వర్యంలో అవగాహనా తరగతులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా వున్న వర్కింగ్ జర్నలిస్టులకోసం ప్రతీ శనివారం ఒక సామాజిక అంశంపై ప్రముఖుల ద్వారా ఆన్ లైన్ విధానంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించ నున్నామని సి.ఆర్ ఆంధ్ర ప్రదేశ్ మీడియా అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం (06. 05. 2023) నాడు వర్కింగ్ జర్నలిస్టులకోసం ఆన్ లైన్ విధానం లో అవగాహనా తరగతులు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. డిప్లొమా ఇన్ జర్నలిజం విద్యార్థులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు సైతం ఈ అవగాహన తరగతుల్లో పాల్గొన వచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతీ శనివారం ఒక సామాజిక అంశం పై ప్రముఖుల ద్వారా ఆన్ లైన్ విధానంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించ నున్నామని ఆయన తెలిపారు. శనివారం(06. 05. 2023) నాడు ఉదయం 9 గంటల నుండి 10 గం.ల వరకు ” జర్నలిస్టులు – సామాజిక బాధ్యత” అనే అంశంపై ప్రముఖ కవి, సాహితీ స్రష్ట ,ఎస్వీ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, కొలకలూరి ఇనాక్ అవగాహన కలిగిస్తారన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ క్రింది జూమ్ లింక్ ని క్లిక్ చేసి అవగాహన తరగతుల్లో పాల్గొనవచ్చు
Zoom Meeting Link
https://us06web.zoom.us/j/81598926979?pwd=UVlvZW5JVGdIVFRhZXFZdjNhNXRPUT09

Meeting ID: 815 9892 6979
Passcode: 12345

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *