Breaking News

నిరుపేద ఆడపిల్ల తల్లిదండ్రులను ఆదుకోవాడినికే వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్య వివాహాలను నివారించి చదువులను ప్రోత్సహించేందుకు పేద వర్గాలకు చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించి గౌరవ ప్రదంగా వివాహాలను జరిపించుకునేలా ప్రభుత్వం వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఎస్‌ డిల్లీరావు అన్నారు.జనవరి నుండి మార్చి 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన వధూవరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాల ద్వారా శుక్రవారం ఆయన క్యాంప్‌ కార్యాలయం నుండి బటన్‌ నొక్కి ఆర్థిక సహాయాన్ని ఖాతాలలో జమ చేశారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్దిదారులతో కలిసి వీక్షించిన అనంతరం జిల్లాకు చెందిన 383 మంది వధువరులకు 3 కోట్ల 13 లక్షల 90 వేల రూపాయల ఆర్థిక సహాయపు చెక్‌ను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మట్లాడుతూ పేద వర్గానికి చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులను నిలుపుదల చేసి బాల్య వివాహాలను జరిపించకుండా నివారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్సార్‌ కళాణ్యమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టి ఆర్థిక చేయుతను అందిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పేద కుటుంబంకి చెందిన ఆడపిల్లల వివాహాలు జరిపించి విద్యవంతులుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నేరవెర్చేలా వదువు వరులు విద్యను కొనసాగించాలన్నారు. జిల్లాలో 383 మంది వధూవరులకు 3 కోట్ల 13 లక్షల 90 వేల రూపాయల ఆర్థిక సహాయపు చెక్‌ను ముఖ్యమంత్రి నేడు వారి ఖాతాలలో జమ చేశారన్నారు. ఇందులో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు 169, మైనార్టి వర్గానికి చెందిన వారు 53, ఎస్సీ షెడ్యుల్‌ కులాలకు చెందిన వారు 130, ఎస్టీ షెడ్యుల్‌ కులాలకు చెందిన వారు 24, విభిన్న ప్రతిభావంతులు 7 జంటలు ఉన్నారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా ఇంటర్‌ విద్య వరకు ఆర్థిక సహాయన్ని అందిస్తున్నారు. జగనన్న విద్య దీవెన ద్వారా ఫీజ్‌ రియింబర్స్‌ మెంట్‌, జగనన్న వసతి దీవెన ద్వారా 25 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందించడం తో పాటు వైయస్సార్‌ కళాణ్యమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫాలో ప్రోత్సహాలకు అదించడం వల్ల గ్రాడ్యుయేషన్‌ విద్యను పూర్తి చేసుకుని జీవితంలో స్థిర పడాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సూచించారు.నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పేద వర్గానికి చెందిన వారు ఆర్థిక పరిస్థితుల కారణంగా వారి పిల్లలకు వివాహాలు జరిపించలేక, మానసికంగా సతమతమవుతున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వైయస్సార్‌ కళాణ్యమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టి ఆర్థిక చేయుతను అందిస్తున్నామన్నారు. అనేక మంది పేద వర్గాల చెందినవారు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక, చదువులు మాన్పించి పనులలో చేర్పించడంతో పాటు బాల్యంలోనే వివాహాలు జరిపిస్తున్నారన్నారు. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి చదువేనని నమ్మిన ముఖ్యమంత్రి విద్యా రంగానికి పెద్ద పీఠ వేస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డలకు చదువులో ప్రోత్సహించడం, బాల్యవివాహాలను ఆరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాప్‌ ఆవుట్‌ రేట్‌ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా వివాహం చేసుకొనే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది. ఎటువంటి వివక్షతలకు తావు లేకుండా గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి పథకల సహాయాన్ని ప్రతి మూడు నెలలకు లబ్దిదారులకు అందిస్తుందన్నారు. వివాహమైన వారు 30 రోజుల్లోగా పథకానికి దరఖాస్తు చేసుకుంటే అర్హతను గుర్తించి పభుత్వం పథకాన్ని మంజూరు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు యండి రుహుల్లా, నగర పాలక సంస్థ డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, అవుతు  శైలజారెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌లు బండి పుణ్యశీల, యం. శివరామకృష్ణ, పెదపాటి అమ్మాజి, టి. శ్రీకాంత్‌, కె.గీతాంజలిదేవి, డ్వామా పిడి జె.సునీత, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *