Breaking News

జిల్లాలో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలుకు చర్యలు తీసుకున్నాం.. తడిసిన జొన్నల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు ప్రతిపాదించనున్నాం…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జిల్లాలో కురిసిన ఆకాల వర్షాలకు వలన దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి రైతులను అదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, దెబ్బతిన్న జొన్నలను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు ప్రతిపాదనలు సమర్పించనున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జిల్లా ప్రత్యేక అధికారి, స్టేట్‌ ట్యాక్స్‌ ఛీఫ్‌ కమీషనర్‌ యం. గిరిజా శంకర్‌కు వివరించారు. జిల్లాలో దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుపై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాయలంలో జిల్లా ప్రత్యేక అధికారి, స్టేట్‌ ట్యాక్స్‌ ఛీఫ్‌ కమీషనర్‌ యం. గిరిజా శంకర్‌ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామం వద్ద ఇటీవల కురిసిన వర్షానికి తడిసి దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రబీ పంటలో సుమారు 64,771 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేయడం జరిగిందన్నారు. వరి కోతలు ప్రారంభమైన తరుణంలో రూరల్‌ మండలంలోని నున్న, పాతపాడు, కండ్రిక, గూడవల్లి గ్రామాలలో రైతులు వరి పంట కోసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించే తరుణంలో సుమారు 9 వేల క్విటాళ్ళ ధాన్యం అకాల వర్షాలకు తడిసి దెబ్బ తినడం జరిగిందని వివరించారు. జిల్లాలో సుమారు 400 మెట్రిక్‌ టన్నుల జొన్నలు ఆరబెట్టే సమయంలో వర్షానికి తడిసి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేయడం జరిగిందన్నారు. పౌర సరఫరాలు రైస్‌ మిల్లర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేసేలా జాయింట్‌ కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారన్నారు. దెబ్బతిన్న జొన్నలను కొనుగోలు చేసేలా మార్క్‌ఫెడ్‌ అధికారులకు ప్రతిపాదనలు పంపించనున్నామన్నారు. వ్యవసాయ అధికారులు పంట దెబ్బతిన్న ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టాలను అంచనా వేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 4 మండలాలలో మాత్రమే సాధారణ వర్షాపాతం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదు కావడం జరిగిందన్నారు. ఇప్పటివరకు వర్షాభావం వల్ల ఎక్కడ పంటలు ముంపునకు గురి కాలేదని కేవలం ఆరబెట్టే సమయంలో వర్షానికి గురై వరి దాన్యం, జొన్నలు దెబ్బతిన్నయని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు వివరించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంపత్‌ కుమార్‌, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ వెంకటేశ్వర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ జయప్రద, డిఎస్‌వో కోమలి పద్మ, జిల్లా వ్యవసాయ అధికారిణి ఎస్‌ నాగమణమ్మ, మార్క్‌ఫెడ్‌ అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *