Breaking News

త‌డిసిన వ‌రి ధాన్యాన్ని త‌క్ష‌ణ‌మే మిల్లుల‌కు త‌ర‌లించండి

-పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ వ‌ద్ద ఆరు ల‌క్ష‌ల‌కుపైగా గ‌న్నీ బ్యాగ్‌లు ఉన్నాయి
-పాత‌పాడు, కుందావారి కండ్రిక‌లో త‌డిసిన ధాన్యాన్ని ప‌రిశీలించిన గిరిజా శంక‌ర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షంతో తడిసిన వరిని ఆలస్యం చేయకుండా రైస్ మిల్లులకు తరలించేందుకు రైతులకు గన్నీ బ్యాగులు అందించి రవాణా సౌకర్యాన్ని క‌ల్పించాల‌ని సంబంధిత అధికారులను కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమీషనర్, ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి ఎం గిరిజా శంకర్ఆ దేశించారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ రూర‌ల్ మంద‌డ‌లం పాతపాడు, కుందావరి కండ్రిక వద్ద ఎన్‌హెచ్‌ఏఐ బైపాస్‌ రోడ్డుపై వర్షానికి తడిసి ఆర‌బెడుతున్న‌ వరి ధాన్యాన్ని ఎన్టీఆర్‌ జిల్లా ప్రత్యేక అధికారి గిరిజాశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌, జిల్లా సరఫరా అధికారి (డీఎస్‌వో) కోమలి పద్మ ఆదివారం ప‌రిశీలించారు. గిరిజాశంకర్ వరిలో తేమ శాతాన్ని పరిశీలించి, మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న వరి బస్తాల తూకాన్ని పరీక్షించారు. వర్షానికి తడిసిన వరి, మొక్కజొన్న, జొన్నలు రోడ్లపై ఆరబెట్టి మిల్లులకు లిఫ్ట్ చేసే స‌మ‌యంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యాన్ని వీలైనంత త్వరగా మిల్లుల‌కు త‌ర‌లించాలని రైతులు గిరిజాశంకర్‌ను కోరారు, ఈ సందర్భంగా గిరిజాశంకర్ మాట్లాడుతూ.. గన్నీ బ్యాగుల కొరత లేదని, పౌరసరఫరాల శాఖలో ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల బస్తాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరినప్పుడల్లా అధికారులు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. రైతులు తమ ఉత్పత్తులను ప్రయివేటు వ్యాపారులకు విక్రయించేందుకు ఆసక్తి ఉంటే అధికారులు అనుమతించాల‌న్నారు. వరిలో తేమ స్థాయిని ప్రస్తావిస్తూ, మిల్లర్లు రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) నివేదికను తీసుకోవాలని ఆయన అన్నారు. కొంతమంది మిల్లర్లు తేమను ప్ర‌త్యేకంగా ప‌రిశీలించి, అది ఆర్‌బికె ఇచ్చిన నివేదిక కంటే అధికంగా ఉందంటూ ధ‌ర‌ను త‌గ్గించేయ‌డం స‌రికాద‌న్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని తగ్గించేందుకు సాకులు చెబుతున్నార‌ని, ఈ విషయంలో అధికారులు ఎవరూ మిల్లర్లను ప్రోత్సహించవద్దని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరస్పరం సమన్వయం చేసుకొని వర్షంతో తడిసిన వరిపైరు రైతులకు సహకరించాలని సూచించారు. అలాగే జిల్లాలో నిలిచిన వరి పంట కోత‌ల‌పై ఆరా తీశారు, వర్ష హెచ్చరికల దృష్ట్యా పంటలు కోయవద్దని సూచించారు. వ్యవసాయ శాఖ విజయవాడ డివిజన్ సహాయ సంచాలకులు బి.వెంకటేశ్వరరావు, విజయవాడ రూరల్ మండల ఎఒ బి.రంగనాథ్ బాబు, కెవి కండ్రిక పిఎసిఎస్ అధ్యక్షులు ఎం.రవీంద్రారెడ్డి , తహ‌శిల్లార్ జాహ్న‌వి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *