Breaking News

దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా ఇస్త్రీ బండి వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ జిల్లాలో ఎవరికి సాధ్యంకాని విధంగా వరుసగా 5సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన ఘనత మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారిదే అని, పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు నెహ్రూ గారు అని అదే బాటలో ఆయన తనయుడు,తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ గారు కూడా నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు అన్నారు.సోమవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు నిరుపేద కుటుంబానికి చెందిన గండేటి తాత బాబు ఉపాధి కొరకు తగు సహాయం చేయాలని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలాకుమారి  ద్వారా అవినాష్ దృష్టికి తీసుకురాగా వారికి 25,000-/ రూపాయల విలువ చేసే ఇస్త్రీ బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో  రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలాకుమారి, వైస్సార్సీపీ నాయకులు కోటి నాగలు,చిన్నబాబు,అలంకార్ బాబు,పెద్దబాబు,కనపర్తి బాబు, పిల్లా వెంకన్న,చంద్ర,సొంగా రాజ్ కమల్,బచ్చు మురళి,ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ మెంబెర్ మెయిన్,దుర్గగుడి పాలకమండలి మెంబెర్ బచ్చు మాధవి మరియు డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *