Breaking News

గంగమ్మ తల్లికి సారె సమర్పించడం నా పూర్వజన్మ సుకృతం… : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గంగమ్మ తల్లికి సారి సమర్పించడం నా పూర్వజన్మ సుకృతం మని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జేసి డి.కె.బాలాజీ,డి ఆర్ ఓ శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులతో కలిసి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సారె సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1980 సంవత్సరంలో నేను చదువుకునే రోజుల్లో మూడుసార్లు గంగజాతరను చూడడం జరిగిందని అప్పటికి జాతరకు,గత సంవత్సరానికి ఈ సంవత్సరాం చుస్తే నభూతో నా భవిష్యత్తుగా చాలా గొప్పగా ఉందన్నారు. పట్టణంలోని వీధుల్లో అక్కడక్కడ గంగమ్మ విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రజలు పూజలు నిర్వహించడం చూస్తుంటే గంగమ్మ పై పట్టణ ప్రజలకు ఎంత భక్తి ఉన్నదని తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే గారు గట్టి ప్రయత్నం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగా ప్రకటించడం శుభ పరిమాణమని తెలిపారు. అతి గొప్ప జాతర మేడారం జాతర అని, ప్రాచీన చరిత్ర కలిగినది తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ముందుండి అన్ని కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారని, ఇంకా ఈ గంగమ్మ జాతర చరిత్ర గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఎమ్మెల్యే కి గంగమ్మ ఆశీస్సులు నిండుగా ఉండాలన్నారు. ఏమైనప్పటికి ఈరోజు గంగమ్మ తల్లికి తన కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులతో కలసి సారె అందజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *