తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత నాలుగు రోజులగా గంగమ్మ తల్లి నామస్మరణ తప్ప మరేదీ లేదని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గంగమ్మ ఆలయం నుండి గత నాలుగు రోజులుగా సాగుతున్న గంగమ్మ జాతర గురించి వివరించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంభువై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి (గోవిందరాజ స్వామి) ఆలయం నుంచి సారె గంగమ్మ తల్లికి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతి వారు ఈ రోజున అమ్మవారి దర్శనానికి రావడం జరిగిందని మౌన స్వామి మఠం వందల సంవత్సరాలుగా శక్తిపీఠంగా విరాజుల్లుతున్నటువంటి ఈ రోజున వచ్చి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని గురించి విశిష్టతను గురించి ఆయన అనుగ్రహభాషణ చేయడం, తిరుపతి ప్రజలను అందర్నీ కూడా పులకాంకితల్ని చేసిందని, ప్రతిరోజు వేలమంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ వేషాలు వేస్తూ మాకు నా మామోషీ లేదు, దేవాలయ కమిటీ ఇచ్చిన పిలుపు కంటే కూడా పెద్ద ఎత్తున ఆనందంగా తారతమ్యం లేకుండా చిన్న పిల్లలతో సహా వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వేషాలు వేయటం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వటం ఆనందం కలిగిస్తుందని తెలిపారు. ఈరోజు నాలుగవ రోజు రేపు ఐదవ రోజున ఆదివారం గంగమ్మ తల్లి భక్తి చైతన్య యాత్ర జరగబోతోంది మన గ్రామమైన తిరుపతికి తొలి గడపగా ఉన్నటువంటి అనంత వీధి నుంచి ఆ చైతన్య యాత్ర ప్రారంభం కాబోతోంది, రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అనంత వీధి నుంచి పరసాల వీధి, ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా వేలాదిమందిగా వచ్చి పరసాల వీధిలో రాత్రి నిద్ర చేసే కొండకు వెళ్లేటువంటి ఆనవాయితీ ఉన్న ఆ పరసాల వీధి గుండా, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎస్పీ కార్యాలయం, కృష్ణాపురం,గాంధీ రోడ్డు బండ్ల వీధి గుండా గంగమ్మ గుడి కి చేరుకుంటుందని, భక్తులు వేలాదిగా తరలిరావాలి వచ్చి గంగమ్మ తల్లి పట్ల తిరుపతి ప్రజలకు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలను చాటుకోవడానికి, ఒక గొప్ప వేదిక రేపు జరగబోయేటువంటి ఆ భక్తి చైతన్య యాత్ర వేలాదిమంది కళాకారులు ఊరేగింపుతుందో పాల్గొని, అమ్మ భక్తి చైతన్య యాత్ర ప్రదర్శన విజయవంతం చేద్దామని, ఈ భక్తి చైతన్య యాత్రలో మీరు కూడా పదం కలపండి, స్వార్థం కోసం చేస్తున్నటువంటి భక్తి ప్రదర్శన కాదు ఇదిని, అమ్మవారి పట్ల తిరుపతి ప్రజలకు ఉన్నటువంటి భక్తిని తెలియజేసేటువంటి యాత్రని తెలిపారు. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రసారమాధ్యమాలు కూడా రేపు ఆ భక్తి చైతన్య యాత్రలు చిత్రీకరించటానికి వస్తున్నారు. తరలిరండి అమ్మ ఏ రకంగా అనుగ్రహిస్తుందో ప్రపంచానికి చాటుదాం, అమ్మ పట్ల తిరుపతి ప్రజలకు ఎంత వినయం తెలియజేద్దాంని, ఆధ్యాత్మిక నగరం నాలుగు రోజులగా గంగమ్మ తల్లి నామస్మరణ తప్ప మరేదీ లేకుండా ఉన్నటువంటి పట్టణంలో రేపు జరగబోయే భక్తీ చైతన్య యాత్ర పరవళ్లు తొక్కాలి, గంగానది ప్రవాహం లాగా వ్రతం వేయాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, అమ్మవారి పట్ల మన భక్తిని చాటుకున్నామని, దేవాలయ కమిటీ ప్రార్థిస్తుంది అర్థిస్తోంది.
Prajavartha Online Telugu News