Breaking News

కొవ్వూరు లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన

-మే 24 న వాలంటీర్ కు వందనం కార్యక్రమం
-కొవ్వూరు లో పలు స్థలాలు పరిశీలన
– కలెక్టర్ కె.మాధవీలత, జెసి తేజ్ భరత్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మే 24 వ తేదీ బుధవారం కొవ్వూరులో  “వాలంటీర్ కు వందనం” రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. సోమవారం స్థానిక కొవ్వూరు లో సిఎం పర్యటన పై ముందస్తు ఏర్పాట్లు నేపథ్యంలో కలెక్టర్ కె.మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్,  వివిధ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 24 వ తేదీ న ” వాలంటీర్ కు వందనం ”  కార్యక్రమంలో , ముఖ్య అతిథిగా హాజరు కానున్నరన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రదేశాలను పరిలించడం జరిగిందని అన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో కలెక్టర్ వెంట ఎన్. తేజ్ భరత్, ఆర్డీవో ఎస్. మల్లి బాబు, తహశీల్దార్లు నాగరాజు  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *