Breaking News

వాలంటీర్ల వందనం కార్యక్రమంలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలో పరిటాల ఓంకార్ కల్యాణ మండపంలో 4,11 డివిజన్ల వాలంటీర్ల వందనం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా కనీవినీ ఎరుగని రీతిలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తున్నారన్నారు. 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లు రాష్ట్రంలో ప్రతి సచివాలయం పరిధిలో పనిచేస్తూ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు అందజేయడంలో ముఖ్యపాత్ర వహిస్తున్నారన్నారు. ప్రతి అవ్వా తాత అన్నా తమ్ముడు అక్క చెల్లి వికలాంగులు ఎదురుచూసే పెన్షన్ ఒకటో తేదీ తెల్లవారుజామునే అందజేయడమైతెనేమి, కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఏవిధంగా ఇబ్బంది పడ్డారో, వారికి చేదోడుగా వాలంటీర్ ఏవిధంగా సేవ చేశారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ముందుండి కార్యక్రమం సఫలీకృతం అయ్యేవిధంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరవేయడంలో, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకు అందజేస్తూ, నిజమైన లబ్ధిదారుల ఎంపికలో వివక్షత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందజేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. వాలంటీర్ల సేవలకు ప్రోత్సాహకంగా 4,11 డిసీజన్ల సంబందించి వాలంటీర్లకు సేవ వజ్రా,సేవా రత్న,సేవ మిత్ర అవార్డులతో సత్కరించుకుంటున్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వం చేపట్టే మరిన్ని మంచి కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించాలని ఆశిస్తూ ప్రతి ఒక్క వాలంటీర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతి,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్ కుమార్,దుర్గ గుడి మెంబెర్ బచ్చు మావి,వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి,ఉదయ్,హరీష్,కళ్యాణ్,సీడీఓ ఉమామహేశ్వరి,జోనల్ కమిషనర్ కృష్ణ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *