-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు అమరావతిలో ఈనెల 26న పండగ వాతావరణంలో జరగనున్న పట్టాల పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గాంధీనగర్ జింఖానా ప్రాంగణంలోని 192వ వార్డు సచివాలయంలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్, రెవెన్యూ, సచివాలయ సిబ్బందితో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. నగరంలో సొంత ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో.. అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకుండా చూడవలసిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని మల్లాది విష్ణు అన్నారు. సీఆర్డీఏ పరిధిలో నియోజకవర్గం నుంచి 7,211 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు కాగా.. వీరందరికీ ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులకు బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, త్రాగునీరుతో పాటు.. సభ వద్ద మొబైల్ టాయిలెట్లు సహా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కనుక ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో సెంట్రల్ ఎమ్మార్వో శ్రీనివాస్ వెన్నెల, సీడీఓ జగదీశ్వరి, వీఆర్వోలు, నాయకులు బంకా భాస్కర్, కాలే పుల్లారావు, పోలగాని వీరయ్య, పులపా కృష్ణ, ఆర్కే, పప్పుల శివ, పఠాన్ భూపతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News