Breaking News

కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుంది

-కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు వివిధ కాళారుపాలతో జీవం పోసి బావితరాలకు అందిస్తున్న పేద కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని, కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన కళాకారులకు మంజూరైన గుర్తింపు కార్డులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆయన కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఉండి అనేక ఇబ్బందులను ఎద్కొంటున్నప్పటికి కళపై ఉన్న మమకారంతో వ్యయ ప్రయాసలను లెక్క చేయకుండా నేటికి కళా ప్రదర్శనల ద్వారా సంస్కృతి సాంప్రదాయాలకు జీవం పోస్తున్న కళాకారులను అదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందన్నారు. 58 సంవత్సరాలు నిండిన నిరుపేదలైన కళాకారులకు నెలకు 3 వేల రూపాలయ చొప్పున పెన్షన్‌ మంజూరు చేస్తుందన్నారు. అర్హలైన కళాకారులకు పెన్షన్‌ మంజూరు చేసేలా సంసృతిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 200 మంది వృద్ద కళాకారులకు పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. 3,463 మంది డప్పు కళాకారులకు గతంలో పెన్షన్లను మంజూరు చేసి నెల 3 వేల చొప్పున 1 కోటి 40 లక్షల రూపాయలను జిల్లా గ్రామీణాభివృద్ధి ద్వారా అందజేస్తున్నామన్నారు.
ఎన్‌టిఆర్‌ జిల్లా అనేక మంది ప్రఖ్యాత కళాకారులకు జన్మనించిందన్నారు. వారి స్పూర్తితో అనేక మంది కళాకారులు ఇప్పటికి కళా ప్రదర్శనలను ప్రదర్శిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారన్నారు. కళాకారులలో అధిక శాతం మంది ఇప్పటికి డప్పు కళపై ఆధారపడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే పండుగాలు జాతరలు, రాజకీయ సభలు సమావేశాల సమయంలో మాత్రమే డప్పు కళాకారులకు జీవనోపాది లభిస్తుందన్నారు. మిగిలిన రోజులలో కళాకారులు కుల వృత్తులపై ఆధారపడుతున్నారన్నారు. డప్పు కళాకారులకు నృత్యాల గేయాలపై శిక్షణ అందించి వారి ప్రతిభను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలలో జిల్లాకు చెందిన డప్పు కళాకారుల సేవలను వినియోగించుకునేలా అధికారులను ఆదేశిస్తామన్నారు. పౌరాణిక సాంఫీుక, నాటక రంగాలలో అభివృద్ధి చేసిన కళాకారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో అర్హత కలిగిన కళాకారులకు గుర్తుంపు కార్డులను మంజూరు చేస్తామన్నారు. గుర్తింపు కార్డుల ద్వారా కళాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి ఎస్‌వి మోహన్‌రావు, ఆడియో విజువల్‌ సూపర్‌వైజర్‌ ఎ. సాయిబాబా, పలు కళాకారుల సంఘాల ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *