విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించి సమర్పించిన పెండిరగ్ ధరఖాస్తులను రెండు రోజులలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా రూపొందించడంపై మంగళవారం కలెక్టర్ డిల్లీరావు, ఈఆర్‌వోలు, ఎఇఆర్వోలు, ఎలక్షన్ డిప్యూటి తహాశీల్థార్లతో కలెక్టర్ డిల్లీరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు చేర్పులు, సవరణలకై సమర్పించే ఫారం`6, 6ఏ,7,8లకు సంబంధించి ఇప్పటివరకు 12,916 అన్‌లైన్ ఆఫ్‌లైన్‌లలో ధరఖాస్తులు సమర్పించడం జరిగిందన్నారు. వీటిలో ఇంకనూ 8,030 ధరఖాస్తులను పరిష్కరించవలసి ఉందని వీటిని రెండు రోజులలో నూరు శాతం పరిష్కరించి ఖచ్చితమైన పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించేందుకు సిద్దం చేయాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం నిర్ధేశించిన ఫారం`6,లో సమర్పించిన వాటిలో 5,046, ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల నమోదుకై సమర్పించిన ఫారం 6 ఏలో సమర్పించిన రెండు ధరఖాస్తులను, జాబితాలో పేరు తొలగింపుకు నిర్ధేశించిన ఫారం 7లో సమర్పించిన 1,289 ధరఖాస్తులు, ఫారం 8కు సంబంధించి నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పుకు వచ్చిన 1693 పెండిరగ్ ధరఖాస్తులను రెండు రోజులలో పరిష్కరించాలన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి సహకరించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
Prajavartha Online Telugu News