Breaking News

గర్భస్థ పిండ లింగ నిర్దారణ నిషేధ చట్టం నిబంధనలను స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ పిండ లింగ నిర్దారణ నిషేధ చట్టం (పిసిపిఎన్డిటి యాక్ట్) నిబంధనలను స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా అమలు చేయాలని నిబంధనలు ఉల్లంఘించి పరీక్షలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం (పిసిపియన్డిటి) అమలుపై మంగళవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ ఢిల్లీరావు అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఫిర్యాదులు వస్తే ఆయా సెంటర్ల లైసెన్స్ లు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టంలో నిర్దేశించిన ప్రకారం స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా ఫారం ఎఫ్ కు సంబంధించి పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. వీటిలో స్కానింగ్ కు సూచించిన డాక్టరు పేరు, పరీక్ష వివరాలు, సంబంధిత గర్భిణీ పేరు అప్పటికే ఉన్న పిల్లల వివరాలు, స్కానింగ్ అనంతర రిపోర్ట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. అప్లోడ్ చేయని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల ను రద్దు చేసేందుకు కూడా వెనుకాడ రాదని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని గుర్తింపు నెంబర్ ను పొందాలని కలెక్టర్ ఢిల్ల్లీరావు అన్నారు.
జిల్లాలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న 265 స్కానింగ్ సెంటర్లకు అదనంగా16 కేంద్రాలు కొత్తగా రిజిస్ట్రేషన్లకు,16 ధరఖాస్తులు రెన్యువల్, 21 దరఖాస్తులు మోడిఫికేషన్ కు, ఒక ధరఖాస్తు రద్దుకు వచ్చిన వాటిని కమిటీ పరిశీలించి అనుమతులు మంజూరు చేసారు. కొత్తగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటుకు, రెన్యువల్ కు, మార్పులు, చేర్పులు వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే కమిటీకి నివేదించాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
సమావేశంలో కమిటీ కన్వీనర్ మరియు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎం. సుహాసిని, సిసిఆర్ బి ఏసిపి కే. వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డా. స్వప్న , ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ జి. కేశవ చంద్ర, వాసవ్య మహిళా మండలి సెక్రటరీ జి. రేష్మీ , ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *