Breaking News

సీఆర్‌డీఏ పరిధిలో నెరవేరిన నిరుపేదల సొంతింటి కల..

-కేటాయించిన ఇళ్ళ స్థలాలను చూసి లబ్దిదారుల ముఖాలలో వెల్లివిరిసిన ఆనందం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఆర్‌డీఏ పరిధిలోని అమరావతి ప్రాంతమందు నిరుపేదల సొంతింటి కల నెరవేరబోతుందని ఇళ్ళ స్థలాలకు కేటాయించిన భూములను చూసి లబ్దిదారుల ముఖాలలో ఆనందం వెల్లివిరిస్తుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
సీఆర్‌డీఏ పరిధిలోని అమరావతిలో ఆర్‌ 5 జోన్‌ నందు ఇళ్ళ స్థలాలను మంజూరైన లబ్దిదారులకు క్షేత్రస్థాయిలో సోమవారం నిడమర్రు లేఅవుట్‌ నందు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ పట్టాలను పంపిణీ చేశారు.
నిడమర్రు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఆర్‌డీఏ ప్రాంతంలో పేద ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోమన్‌రెడ్డి ఇళ్ళ స్థలాలను మంజూరు చేయడం భవిష్యత్‌లో చారిత్రాత్మకమైన సంఘటనగా నిలిచిపోతుందన్నారు. ఆర్‌ 5 జోన్‌ నందు 737 ఏకరాల విస్తీర్ణంలో 14 లేఅవుట్ల ద్వారా ఎన్‌టిఆర్‌ జిల్లాకు చెందిన సుమారు 27,031 మంది లబ్దిదారులైన మహిళల పేరున పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన 2,924 మంది లబ్దిదారులను 100 బస్సులలో తుళ్ళూరు మండలం నిడమర్రు గ్రామంలో 86 ప్లాట్లులో కేటాయించిన ఇళ్ళ స్థలాలకు సంబంధించిన భూమిని క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు చూపించడం జరిగిందన్నారు. కేటాయించిన భూములను చూసి లబ్దిదారులకు ఆనందం వ్యక్తిం చేస్తున్నారన్నారు. లబ్దిదారులకు కేటాయించిన భూములలో జియో ట్యాగింగ్‌ చేసి పారదర్శకంగా పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 30వ తేది మంగళవారం మరో 6,700 మంది, 31వ తేది బుదవారం 4 వేల మంది లబ్దిదారులకు వారికి కేటాయించిన భూములను స్వయంగా లబ్దిదారులకు చూపించి పట్టాల పంపిణీ చేయనున్నామన్నారు. వారం రోజులలో ఇళ్ళ స్థలాలు మంజూరైనా ప్రతి లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారి చేశామన్నారు. లేఅవుట్లలో 9 మీటర్లు, 53 మీటర్ల రోడ్డులను అభివృద్ధి చేయడంతో పాటు లబ్దిదారులకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్‌, డ్రైనేజ్‌, వంటి మౌలిక వసతులను కల్పించనున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ నగరంలో సొంత ఇళ్ళు లేక అద్దె చెల్లించలేని పరిస్థితులలో అనేక మంది నిరుపేదలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాడంతో ఆయన సానుకూలంగా స్పందించి నిరుపేదలైన అక్కచెల్లెమ్మలకు రాజధాని ప్రాంతంలో భూములను కేటాయించి సొంత ఇంటి కల నెరవేర్చారన్నారు. నిరుపేదలను అన్ని విధాల ఆదుకోవాలనే దృక్పదంతో ఎన్ని ఇబ్బందులను ఎదురైనప్పటికి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు జగనన్న కాలనీలలో సొంత ఇంటి కలను నెరవేర్చి దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రస్థానాన నిలిచారన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో లక్షలాధి రూపాయల విలువగల భూములను పేదల ఇళ్ళ స్థలలకు కేటాయించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధాన్యవాదాలను తెలియజేస్తున్నానని శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ అన్నారు.
కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ అవుతూ శ్రీ శైలజారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంపత్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, తహాశీల్థార్‌ సిహెచ్‌ దుర్గాప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *