Breaking News

“ప్రభుత్వ నాలుగేళ్ల పరిపాలన – తీరు తెన్నులు”

-మీడియా అకాడమీ చైర్మన్ – కొమ్మినేని శ్రీనివాస రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ప్రభుత్వ నాలుగేళ్ల పరిపాలన – తీరు తెన్నులు” పై స్థానిక సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయం లో మంగళవారం (30.05.2023) 10 గంటలకు సెమినార్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్  కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు.  వై.ఎస్. జగన్ మోహన రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019 మే నెల 30 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఆ ప్రకటనలో ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన పరిపాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలల ఫలాలు పేదలకు అందడం మొదలై నాలుగేళ్లుపూర్తయ్యాయని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల పై విశ్లేషణకు మేధావులు, జర్నలిస్టులతో “రౌండ్ టేబుల్ సెమినార్ ” నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సెమినార్ లోఅధికార భాషా కమిటీ చైర్మన్ ” పి. విజయ బాబు”, ఆంధ్రా లయలా కళాశాల రిటైర్డ్ లెక్చరర్ ప్రొఫెసర్ ఎం.సి.దాస్”, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ “ప్రొఫెసర్ ఈ. శ్రీనివాస రెడ్డి,” ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగ అధిపతి “డా. జి. అనిత”, సీనియర్ జర్నలిస్టులు నిమ్మరాజు చలపతి రావు, “వి.వి.ఆర్. కృష్ణం రాజు”,” కె.బి.జి. తిలక్”, ఎన్.టి.వి. సీనియర్ జర్నలిస్ట్ “రెహనా బేగం”,దూర దర్శన్ న్యూస్ ప్రెజెంటర్ “లక్ష్మి పోరంకి”, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ  “మామిడిపల్లి బాల గంగాధర తిలక్” తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *