Breaking News

ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి సమస్యలపై అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సిడిఎంఏ మరియు గుంటూరు నగరపాలక సంస్థ కమీషనర్ (ఎఫ్ఏసి) ఆదేశాల మేరకు డిప్యూటీ కమీషనర్ సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారం పట్ల భాధ్యతతో వ్యవహరించాలని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోనే పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. నోడల్ అధికారులు సచివాలయ కార్యదర్శుల పనితీరు, సేవలు, స్థానిక సమస్యలపై పర్యవేక్షణ చేయాలని, ప్రతి సోమవారం నోడల్ అధికారులతో సచివాలయ పనితీరుపై సమీక్షా చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ వార్డ్ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. సోమవారం నిర్వహించిన స్పందనలో 32 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 10, ఇంజినీరింగ్ విభాగం 11 , ప్రజారోగ్య విభాగం 4, రెవెన్యూ విభాగం 2 , ఉపా సెల్ విభాగం కి సంబధించి 2, పరిపాలన విభాగానికి సంబందించి 3 ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, సిఎంoహెచ్ డాక్టర్ విజయలక్ష్మి, ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సిటి ప్లానర్లు, ఏ.సి.పి.లు, ఈ.ఈ లు, యస్.యస్, సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *