Breaking News

పార్టీలకు అతీతంగా ప్రజలు పోరాడితేనే ప్రజలకు రక్షణ అదే నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణ… : గాంధీ నాగరాజన్‌ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మద్యపాన నిషేదమే స్త్రీకి రక్షణ కవచం, కుటుంబానికి రక్షణ కవచం, దేశానికి రక్షణ కవచమని గాంధీదేశం సోషల్‌వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్‌ అన్నారు. సోమవారం గాంధీనగర్‌లోని ధర్నా చౌక్‌లో సోమవారం రెండవ రోజు దండియాత్ర-2 రిలే నిరాహార నిరసన దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్‌ మాట్లాడుతూ ఎండకి నా గుండె కాలోచ్చు, మీ తుపాకి గుండుకి నా గుండెపేలొచ్చు, సత్యాగ్రహి అంటే భయపడేవాడు కాదు, భయపెట్టెవాడు కాదు, భయాన్ని పొగొట్టేవాడు సత్యంతో, అహింసతో పోరాడేవాడు గాంధేయవాది అని అన్నారు. రాజకీయ పార్టీలు చేసే పోరాటం ప్రజాస్వామ్యాన్ని రక్షించలేదు. పార్టీలకు అతీతంగా ప్రజలు పోరాడితేనే ప్రజలకు రక్షణ అదే నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణ. స్వార్థంతో బ్రతికేవాళ్ళు కొందరు దేశాన్ని దోచుకుంటారు. ఎమ్మెల్యే, ఎంపి, మంత్రులు, సిఎంలు, పీఎంలు, అధికారులు, రాజకీయనేతలు, వారి పరిపాలన విధానాలు కావచ్చు. ఇదే ఈనాటి మన ప్రజాస్వామ్యం. దీనికి బాధితులు సామాన్య మధ్య తరగతి ప్రజానీకం అందుకే మన కోసం మనమే పోరాడాలి. మన దేశం మన ప్రజలు మనదే సందేశం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో, హాస్టల్స్‌, వృద్ధాశ్రమాలలో, ఆసుపత్రులలో నాసిరకం, నాణ్యతలేని బియ్యంతో భోజనాలను వ్యతిరేకించాలి. ఇలా వివిధ రూపాలలో బడుగు బలహీనవర్గాలు బలైపోకుండా కాపాడుకుంటేనే భావితరాలకు వారికి భవిష్యత్తు. అందుకే మన కోసం మనం పోరాడాలి. అందుకే నేను గాంధీ, నాలో అంబేద్కర్‌గా నేను చేస్తున్న ఈ సత్యాగ్రహ దీక్షలు దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు నా సందేశం అని అన్నారు. ఈ సమావేశంలో ట్రస్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు ‘బంగారు’ భారతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *