Breaking News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి

తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని నేటి రాత్రి దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి. గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంకు తిరుపతి కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి తో కలిసి చేరుకున్న వీరికి ఆలయ ఏఈఓ ప్రభాకర్ రెడ్డి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఏఈఓ, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రధాన కార్యదర్శి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. దర్శనానికి ముందు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి, జెసి డి కే బాలాజీ, ఏ ఎస్పీ వెంకట్రావ్ డిఎస్పీ భవ్యశ్రీ, బర్డ్స్ హాస్పిటల్ డైరెక్టర్ రెడ్డప్ప, ఆర్డీఓ లు రామారావు, కనక నరస రెడ్డి తదితరులు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *