-జూన్ ఆఖరికి పనులన్నీ పూర్తి చేయాలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మెడికల్ కళాశాల నిర్మాణ పనులు రాష్ట్ర వైద్య మౌలిక వసతులు అభివృద్ధి సంస్థ విసి&ఎండి డి. మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యే పేర్ని పరిశీలించారు.
రాష్ట్ర వైద్య మౌలికవసతుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. మురళీధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నాని లతో కలిసి బుధవారం స్థానిక మెడికల్ కళాశాల సందర్శించి భవన నిర్మాణాల ప్రగతి, నిర్మాణాలు పూర్తయిన భవనాలలో సౌకర్యాల కల్పన వంటి అంశాలు పరిశీలించారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎండి జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు.
మెడికల్ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభించుటకు హాస్టల్ భవనాలు, ల్యాబ్స్ భవనాలు షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
నీటి సరఫరా కోసం 8.8 కోట్లు మంజూరు చేసినట్లు, ఈ పనులు వెంటనే చేపట్టెల టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి అన్నారు.
150 మంది విద్యార్థులకు హాస్టల్ వసతికి నిర్మిస్తున్న భవనాలలో వసతి సౌకర్యాలతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించుటకు సంపు పాయింట్ నుండి పైప్ లైన్ కనెక్షన్లు వంటి పనులు పూర్తి చేయాలన్నారు. హౌస్ కీపింగ్ సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా పనులు, ఇంటర్నెట్ సౌకర్యం, సీసీ కెమెరాలు ఏర్పాటు, ఆడియో వీడియో సిస్టం ఏర్పాటు పనులు, అంబులెన్స్ లు, ల్యాబ్స్ లో పరికరాలు ఏర్పాటు, ఏసీ సౌకర్యం పనులు ఎంతవరకు వచ్చాయి ఆరా తీశారు. మైక్రోబయాలజీ వంటి నాలుగు విభాగాలకు నాలుగు లేబరేటరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు శానిటేషన్, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పెస్ట్ కంట్రోల్ చర్యలు తీసుకోవాలన్నారు.
వాహనాల పార్కింగ్ సంబంధించి పక్కాగా పై కప్పుతో ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలం లోగా డ్రైనేజీ నిర్మాణ పనులు, అప్రోచ్ రోడ్లు అప్రోచ్ రోడ్లు పూర్తి చేయాలని అన్నారు హాస్టల్లో వద్ద ల్యాబ్స్ వద్ద తాగునీటి సరఫరాకు అవసరమైనన్ని వాటర్ డిస్పెన్సర్లు, ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేయాలని ఎండి సూచించారు.
హాస్టల్లో ఫర్నిచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విండోలకు మస్కిటో నెట్లు, హ్యాంగర్స్ ఏర్పాటు చేయాలనీ, వైద్య పరికరాలు కళాశాలకు పంపామని, అవి తీసుకుని స్టాక్ ఎంట్రీలు పక్కాగా నమోదు చేయడంతో పాటు స్టోర్ ఇన్చార్జ్ లను ఏర్పాటు చేయాలన్నారు. జూలై నుండి ఇన్స్టాలేషన్ పనులు మొదలు పెట్టాలన్నారు. వచ్చేవారం ముఖ్యమంత్రి సమీక్షిస్తారని విలువగా పనులన్నీ కొలిక్కి రావాలన్నారు. ప్రిన్సిపాల్ ,వైస్ ప్రిన్సిపాల్ ఇక్కడకు వచ్చి కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు గర్ల్స్ హాస్టల్ కాంపౌండ్ వాల్ పూర్తి చేయాలని అన్నారు అడ్మిషన్లు ముందు పిల్లలు వారి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి వసతులు చూసుకుంటారని, వారిలో సానుకూల దృక్పథం కలిగేలా పనులన్నీ సకాలంలో పూర్తిచేసి ఇతర కళాశాలలకు మోడల్ గా తీర్చిదిద్దాలని ఎండి సూచించారు. కేవలం ప్రధాన భవనాలు నిర్మాణం పూర్తి చేస్తే అంతా అయిపోయినట్లు కాదని, వసతుల కల్పన ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు.
స్థానిక సర్వజన ఆసుపత్రి లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో రెండు లిఫ్టులు మరమ్మత్తులు అవసరమని, కాన్ఫరెన్స్ హాల్ అవసరమైన మరమ్మత్తులు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని ఆసుపత్రి సూపర్డెంట్ తెలుపగా, అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలనీ సూపర్నెంట్ ను ఆదేశించారు. రెండు బస్సులు ఏర్పాటు చేయాలని తెలుపగా వాటి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు
ఈ కార్యక్రమంలో ఏపీ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ సూపర్నెంట్ ఇంజనీర్ బలరాం రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి రవీంద్రబాబు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి, వైస్ ప్రిన్సిపాల్ ఆశాలత, మేఘ ప్రతినిధులు కృష్ణారెడ్డి, జగదీష్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News