Breaking News

కొవ్వూరులో సిఎం తీసుకున్న అర్జీలు పరిష్కార స్థాయిపై సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 24 బుధవారం   కొవ్వూరు పర్యటన లో ప్రజల నుంచి  స్వీకరించిన అర్జీల పరిష్కార అనంతర పురోగతిపై సమీక్షించి నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం రెవెన్యూ , వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత  మాట్లాడుతూ, మే 24 న కొవ్వూరు పర్యటన లో   స్వీకరించిన జిల్లాకు చెందిన 18 అర్జీలను పరిశీలించి , ఆమేరకు అర్జీలు 24 గంటలు కాకముందే పరిష్కారం చూపి ఆదుకోవడం జరిగిందని అన్నారు.  అనారోగ్య సమస్యకు తక్షణ ఆర్థిక సహాయం అందజేయడం తో ,  సిఫార్సు చేయడం జరిగిందన్నారు.  మరో ఐదు దరఖాస్తులు  ఇంటి కోసం, ఉద్యోగ ఉపాధి కోసం కోరడం జరిగిందని, ఆ మేరకు  పరిష్కరించేందుకు అధికారులు  తీసుకున్న చర్యలను సమీక్షించి నట్లు కలెక్టర్ తెలిపారు. వైద్యపరమైన అంశాలు కింద వొచ్చిన అర్జి దారుల ఆరోగ్య పరిస్థితి పై వైద్య అధికారులు, ఆరోగ్యశ్రీ సమన్వయ కర్త వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యతలను వ్యక్తిగత శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

పసివేదల కు చెందిన ఎస్కె. మూస ఎన్ పి ఐ కింద ఇంటి స్థలం కేటాయింపు కై రెవెన్యూ, , హెల్త్ పెన్షన్ కింద నమోదు ప్రక్రియ పూర్తి చేసినట్లు వైద్య అధికారులు తీసుకున్న చర్యలు వివరించారు.

నందమూరు కి చెందిన పి. కొండల రావు ఉద్యోగ భద్రత కోసం కోరగా వికాస ద్వారా “కాజెంట్ ఈ సర్వీస్” లో జూన్ 6న నెలకు రూ.16 వేల జీతం తో విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దొమ్మెరు కి చెందిన కే . లక్ష్మి ఉద్యోగ భద్రత కోసం కోరగా వికాస ద్వారా ” కాజెంట్ ఈ సర్వీస్” లో జూన్ 6న నెలకు రూ.16 వేల జీతం తో విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గోపాలపురం కి చెందిన చల్లా వీర నాగరాజు కి ఉద్యోగ భద్రత కోసం కోరగా వికాస ద్వారా ” కాజెంట్ ఈ సర్వీస్” లో జూన్ 6న నెలకు రూ.16 వేల జీతం తో విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

చిక్కాల కు చెందిన ఇళ్ళ మంగరావు కి రూ.5 వేల చొప్పున మెడికల్ పెన్షన్ కింద పేరు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు , డిప్యూటీ డి. యం. హెచ్. ఓ డా. పి. మనోజ్ , ఆరోగ్య శ్రీ సమన్వయ కర్త డా. పి. ప్రియాంక, డి. యల్. డి. ఓ, వి. శాంతా మణి, నిడదవోలు మునిసిపల్ కమీషనర్, కె. వి. పద్మావతి, డి ఎం హెచ్ ఓ కార్యాలయ  సి. ఎస్. ఆర్. యం, నిజరుద్దీన్,  డా. అభిషేక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *