Breaking News

బాలల హక్కుల పరిరక్షణలో ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ సేవలు భేష్…..జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను బాలల స్నేహ జిల్లాగా తీర్చిదిద్దడంలోను ఆపదలో ఉన్న బాలల, బాల కార్మికుల రక్షణకు బాల్య వివాహాల నిరోధానికి ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అందిస్తున్న సేవలు అద్వితీయమని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు.ఫారం ఫర్ చైల్డ్ రైట్స్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోస్టర్ లోగోను శనివారం నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయంలో కలెక్టర్ ఢిల్లీ రావు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సభ్యులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు నుండి ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, జిల్లా యంత్రాంగం సహకారంతో 46వేల మంది బాలలను రక్షించి సంరక్షించి క్షేమంగా అమ్మ ఒడికి చేర్చారన్నారు. ఫోరం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ సభ్యులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా యంత్రాంగంతో సహకరించి బాలల హక్కుల పరిరక్షణకు తమ సహకారం అందించాలని కోరారు.కార్యక్రమంలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ నిర్వహికులు బి.ఎస్ కోటేశ్వరరావు, నోయల్ హార్పర్, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్,టీం సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *