Breaking News

ప్రైవేట్ వెంచర్లు లేదా లే అవుట్లు తగిన అనుమతులతోనే ఏర్పాటు చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రైవేట్ వెంచర్లు లేదా లే అవుట్లు తగిన అనుమతులతోనే ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే పట్టణ ప్రణాళిక అధికారులు తొలగింపు చర్యలు తీసుకుంటారని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ బొంతపాడులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్ ని తనిఖీ చేసి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వెంచర్లు అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే సంబందిత ప్లానింగ్ కార్యదర్శి, పట్టణ ప్రణాళిక అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బొంతపాడులోని వెంచర్ ని పరిశీలించి, రోడ్ వైడెనింగ్ పోర్షన్, అంతర్గత రోడ్ల వెడల్పు, ప్లాట్ల కొలతలు, మార్ట్ గేజ్ ప్లాట్లు, యుటిలిటి ఏరియా, ఎమినిటీస్ ఏరియా, ఓపెన్ స్పేస్, గ్రీనరి, డ్రైన్ల ఏర్పాటుపై వివరాలు అడిగి తెలుసుకొని, రోడ్ల కొలతలను నేరుగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణ ప్రణాలిక అధికారులతో కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబందనల మేరకే వెంచర్లకు అనుమతులు ఇవ్వాలని, అందుకు తగిన విధంగానే పట్టణ ప్రణాలిక అధికారులు నేరుగా పరిశీలించాలన్నారు. తుది అనుమతుల కోసం తమకు పంపే ముందే ప్రణాళిక అధికారులు సదరు వెంచర్ లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబందనల మేరకు లేని వెంచర్లకు అనుమతులు మంజూరు చేయబోమన్నారు.
పర్యటనలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఏ.సి.పి. అశోక్ కుమార్, టి.పి.ఎస్. సువర్ణ కుమార్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *