Breaking News

అందుబాటులో గ్రామ స్థాయి నుండి కార్పోరేట్‌ ఉచిత వైద్యం

-రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య, విద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గ్రామ స్థాయి నుండి టీచింగ్‌ ఆసుపత్రి వరకు అన్ని స్థాయిలలో కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యా శాఖ మంత్రి విడదల రజిని అన్నారు.
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.3 కోట్ల నాబార్డ్‌ నిధులతో నిర్మించిన 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి భవనాన్ని, కొల్లా కౌంప్లెస్‌, మిట్ట గూడెం వద్ద రెండు అర్భన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లను మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి విడదల రజిని ప్రారంభించారు.
సామాజిక ఆరోగ్య కేంద్రంలో అత్యవరస విభాగం, మైనర్‌ ఓటి డ్రెస్సింగ్‌ ఇంజక్షన్‌ సర్జికల్‌ వార్డు, ఆర్థోపెడిక్స్‌ ఓపి, జనరల్‌ మెయిల్‌ ఓపెన్‌, ఇసిజి అల్ట్రాసౌండ్‌ల్యాంబ్‌, సర్జికల్‌ ఓపి తదితర విభాగాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం నిరు పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గ్రామ స్థాయి నుండే ప్యామీలి ఫిజీషన్‌ ద్వారా వైద్యసేవలను అందుబాటులో ఉంచి ప్రతీ పేదవానికి ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు పారామెడికల్‌ సిబ్బంది కొరత లేకుండా నియమకాలు చేపట్టామన్నారు. నాడు`నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 121 పిహెచ్‌సిలు, 42 ఏరియా ఆసుపత్రులు, ఆధునీకరణకు 1,223 కోట్ల నిధులను కేటాయించి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు అర్భన్‌ హెల్త్‌ సెంటర్లు ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. గ్రామస్థాయిలో వైద్యులు రోగుల వద్దకే వెళ్ళి వైద్యం అందించే విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా కిడ్నీ వ్యాధులకు సంబంధించి అవసరమైన చోట డయాలసీస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16,855 కోట్ల రూపాయల నిధులతో గ్రామ స్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయి ఆసుపత్రుల వరకు అభివృద్ధి చేస్తున్న ఎకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో 10,032 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను సుమారు 1,692 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్నామని మంత్రి విడదల రజిని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ విప్‌, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ పేదవాడికి వైద్యం విద్య అందించాలని వేల కోట్ల రూపాయలను నిధులను కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామి మేరకు పభుత్వ ఆసుపత్రిలో రూ. 3 కోట్ల నిధులతో 20 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించి అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా ఆయన వాగ్థానాన్ని నేరవేర్చామన్నారు. దీనితో పాటు పట్టణ పరిధిలో రెండు అర్భన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు ప్రారంభించడం శుభ సూచకం అన్నారు. టిడ్కో గృహాలను లబ్ది దారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని దీనిలో భాగంగా ఇప్పటికే భూ యజమానులకు చెల్లింపులు పూర్తి చేయడం జరిగిందని త్వరలో పంపిణీ చేయనున్నామన్నారు. జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు పూర్తి సహకారాన్ని అందిస్తూ త్వరితగతిన కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్న బస్టాండ్‌ నిర్మాణ పనులు త్వరలో పూర్తి కావచ్చయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎనస్థేషీయా, ఆర్థోపిడెక్‌, ఇఎన్‌టి, ఆప్త్తమాలజీ, నెప్రాలజీ వంటి నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. కోటి రూపాయలతో డయాలసిస్‌ కేంద్రం ద్వారా కిడ్నీ రోగులకు సేవలందిస్తున్నామన్నారు. పట్టణంలోని స్థానిక చెరువును సిఎస్‌ఆర్‌, డియంఎఫ్‌ 3 కోట్ల రూపాయల నిధులతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విఫ్‌ శాసనసభ్యులు అన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత నిస్తుందన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలొ 20 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా అభివృద్ధి చేయడం, రెండు అర్భన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు ప్రారంభించడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. వైద్య ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అధిక సంఖ్యలో నియమకాలు చేపట్టి డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, టెక్నికల్‌ సిబ్బందిని నియమించడం వల్ల ఫలితాలు ప్రజలకు అందుతాయన్నారు. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో సదరం క్యాంపులు కూడా ఇక్కడే నిర్వహించుకునే వెసులుబాటు కలిగిందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్రరావు, కెడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, వైద్య విధాన పరిషత్‌ జాయింట్‌ కమీషనర్‌ డా. పి సరళమ్మ, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిసిహెచ్‌ఎస్‌ డా. జి స్వప్న, మెడికల్‌ ఆఫీసర్‌ ఆళ్ళ హరిష్‌, ఏపియంఎస్‌ఐడిసి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ యం లింగయ్యనాయుడు, మోగా ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ యం వీరారెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్‌ పి రోశయ్య, స్థానిక నాయుకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *