విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ విభాగంలో మరుగుదొడ్ల పైపులైన్లు, డ్రైనేజీ మరమ్మతులు చేపట్టి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ విభాగంలోని శానిటేషన్ మెరుగుదలపై ముఖ్యంగా మరుగుదొడ్లు, ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ పై ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపి యంఎస్‌ఐడిసి), మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు తో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్‌లతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢల్లీి రావు మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ విభాగంలో మరుగుదొడ్ల పైపులైన్ల ఏర్పాటుకు సంబంధించిన మ్యాపులను పరిశీలించి నీరు పారుదలకు ఆటకం కలిగిస్తున్న వ్యర్థాలను తక్షణమే తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో అవసరమైన చోట్ల పాడైన పైపులను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్లలో నీరు నిల్వ ఉండటానికి తగిన కారణాలను ఇంజనీరింగ్ అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సమయంలో నాటి పరిస్థితుల ప్రభావంతో పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించ లేకపోవడం, ఆ సమయంలో వ్యర్థాలు పైపులలో పేరుకుపోయి ఉండవచ్చుననే సందేహాలను ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సూపర్ స్పెషాలిటీ విభాగంలో డ్రైనేజీ, ఎలక్ట్రికల్ వ్యవస్థపై వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఎస్‌టిపి ప్లాంట్ వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో ఎస్‌టిపి, ఇటిపి ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
సమావేశంలోఎపిఎంఎస్‌ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యం. లింగయ్య నాయుడు, కార్పొరేషన్ ఇ ఇ చంద్రశేఖర్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేష్, గ్రాడ్యుయల్ ఇంజనీర్ టి. వీర మణికంఠ, డిప్యూటి ఇఇ ఎస్ వి వి సత్యనారాయణ, డిఇ పాత్రుడు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News