-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించడం ద్వారా నూతన అధ్యాయానికి నాంది పలికి దేశ పురోగతికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయ వీడియోకాన్ఫరెన్స్ హాల్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణలో ఉత్తమ సేవలందించిన, ఆపరేషన్ చేయించుకున్న వారికి జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ప్రోత్సహక బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నానాటికి పెరుగుతున్న జనాభాను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో మానవ వనరుల సమతుల్యాన్ని కూడా పాటించాలన్నారు. భావితరాలకు సహజ వనరులను అందించేందుకు పరిమిత కుటుంబం దేశ పురోగతికి దోహదపడుతుందన్నారు. వనరులు అన్నింటిలోను మానవ వనరులు అసాదారణమైనవన్నారు. ప్రకృతి వైపరిత్యాలు, కోవిడ్ వైరస్ వంటి వ్యాధులను ఎదుర్కొని అప్రహితంగా మనవ మనుగడ కొనసాగుతుందన్నారు. మానవ వనరులను సంరక్షించుకుంటూ అదే సమయంలో కుటుంబ నియంత్రణను పాటించేందుకు జనాభా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.1950 సంవత్సరం నుండి దేశ వ్యాప్తంగా జనగణన ప్రారంభమైయిందని ఇప్పటివరకు ఏడు సార్లు జనాభా గణన జరిగిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8 కోట్ల 53 లక్షలు కాగా ప్రపంచ జనాభా 8 బిలియన్‌లకు పెరిగిందన్నారు. ప్రపంచ జనాభాతో పోలిస్తే యువ జనాభా కలిగిన దేశంగా గుర్తుంపు పొందడం శుభ సూచకమని అన్నారు. జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలోనే మన దేశం ద్వితీయ స్థానంలో ఉందని పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కుటుంబ నియంత్రణను పాటించాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. తక్కువ జనాభాతోనే అభివృద్ధి సాధ్యాపడుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల జనాభా పెరుగుదలను నియంత్రించగలుగుతున్నామని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
ఈ సందర్భంగా వేసక్టమి వేయించుకున్న వారిలో గుర్రాల లక్ష్మణరావుకు 5 వేల రూపాయలను,
పిపిఐ యుసిడి వేయించుకున్న వారిలో లక్కీడీప్ ద్వారా ఎంపికైన షేక్ సతార్‌బి, యండి హబీదా కు ఒక్కొకరికి 5 వేల రూపాయలు,
అంతర్ ఇంజక్షన్ చేయించుకున్న వారిలో లక్కీడీప్ ద్వారా ఎంపికైన షేక్ ఖతీజాకు 5 వేల రూపాయలు
శస్త్రచికిత్సలకు ప్రోత్సహించి ఉత్తమ సేవలందించిన ఇద్దరు ఏఎన్‌యంలు ఎ,రాణి, తాళ్లూరి శ్యామల కు ఒక్కొకరికి 2,500 రూపాయలను,
ఇద్దరు ఆశ కార్యకర్తలు సిహెచ్ కరుణ, వి.జ్యోతిష్మతి కు ఒక్కొకరికి 2,500 రూపాయలను,
పిపిఐయుసిడి కి ప్రోత్సహించిన కౌన్సిలర్ల అయిన డా. యం. లక్ష్మి మధులిక, యన్. రాజశ్రీ లకు ఒక్కొక్కరికి 3000 రూపాయలు,
వేసక్టమి శస్త్రచికిత్సకు ప్రోత్సహించిన కౌన్సిలర్ బి.వి. రమణ ఫ్యామిలి వెల్ఫేర్ వర్కర్ కు 3000 రూపాయలను,
పిపిఐయుసిడి అమర్చడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన డా. మొబినే అహ్మద్‌కు 7000 రూపాయలు, డా. కె. సాయి దుర్గాప్రసన్నకు 5000 రూపాయలు,
వేసక్టమి శస్త్రచికిత్సలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వైద్యులు డా. యస్ రమేష్ 4000 రూపాయలను పోత్సాహక నగదు బహుమతులను, సర్టిఫికేట్లను అందజేసి అనంతరం కుటుంబ నియంత్రణ పద్దతులపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం సుహసిని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News