విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా గడప వద్దకే ప్రభుత్వ సేవల వినూత్న కార్యక్రమం జగనన్న సురక్షను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ అన్నారు.
మైలవరం మండలం మొరుసుమల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ హాజరై కుల, ఆదాయ, దృవీకరణ పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికి అందాలని అర్హత ఉన్నప్పటికి సరైన దృవీకరణ పత్రాలు లేక ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం నెల రోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించి పత్రాలను అందిస్తున్నారన్నారు. వీటిలో 11 రకాల సెవలైన జనన, మరణ, కుల,ఆదాయ, కుటుంబ, వివాహ దృవీకరణ పత్రాలు న్యూటేషను,్ల ఆధార్‌కు మొబైల్ అనుసంధానం, సిసిఆర్‌సి కార్డు, కొత్త రేషన్‌కార్డులు, కుటుంబ వివరాలలో మార్పులు తదితర సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హులైన కౌలుదారులకు రుణకార్డులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది నిర్వహించే ఇంటింటి సర్వేలో కుటుంబ సభ్యులు తమకు అవసరమైన సేవలను వారి దృష్టికి తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో మైలవరం తహాశీల్థార్ శ్రీనివాస్ స్థానిక నాయకులు ఉన్నారు.
రీ సర్వే పనులు వేగవంతం చేయండి…జాయింట్ కలెక్టర్
మైలవరం మండలం ములకలపంట గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వేలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులను చేపట్టాలన్నారు. రీ సర్వే పనులు నిర్థేశించిన గడువులోగా పూర్తి కావాలన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భాగంగా జరుగుతున్న రీ సర్వేతో ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
Prajavartha Online Telugu News