Breaking News

కాటన్‌ సంచులను అందరూ సద్వినియోగం చేసుకోవాలి..

-ప్లాస్టిక్‌ సంచులకు స్వస్థి పలికి పర్యావరణాన్ని పరిరక్షించాలి..
-స్వచ్చ విజయవాడకు హెచ్‌పిసిఎల్‌ సహకారం అభినందనీయం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ సంచులను వీలైనంత వరకు తగ్గించి గుడ్డ సంచులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రజలకు పిలుపు నిచ్చారు.
స్వచ్‌ భారత్‌, స్వచ్‌ పక్వాడా లో భాగంగా మంగళవారం హెచ్‌పిసిఎల్‌ ( హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ) ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి నందు గుడ్డ సంచులు (క్లాత్‌ బ్యాగులు) పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై రోగులకు క్లాత్‌ బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ స్వచ్చ విజయవాడకు హెచ్‌పిసిఎల్‌ వారు అందిస్తున్న సహకారానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్లాస్టిక్‌ సంచులను విలైనంతవరకు తగ్గించి కాటన్‌ సంచులను అందరూ వినియోగించుకోవాలని తద్వారా కాలుష్యని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చునన్నారు. ప్రజల జీవన శైలిలో మార్పులు తేచ్చేందుకు అనేక కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్‌ సంచులు, ఫ్లాస్టిక్‌ ఫైక్సీలు, బ్యానర్స్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేదాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాటన్‌ బ్యాగులు పంపిణీ చేయడం వలన ప్రజలలో ఇది ఎందుకు చేస్నున్నారనే ఆలోచన కలుగుతుందన్నారు. విజయవాడలో ఉండే కెనాల్స్‌ వంతెన దగ్గర ప్లాస్టిక్‌ రహిత అవగాహన బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్లాస్టిక్‌ వలన కలిగే అనర్థాలు, వాటి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ బోర్డులలో రాయడం జరిగిందన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని ప్రజలందరూ పర్యావరణ అనుకూల అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. హెచ్‌పిసిఎల్‌ సంస్థను ఆదర్శంగా తీసుకుని జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకురావాలని కలెక్టర్‌ డిల్లీరావు పిలుపునిచ్చారు.
అనంతరం రైవస్‌, ఏలూరు కాలువల ఇరువైపుల ప్లాస్టిక్‌ బ్యాగులు, కవర్స్‌, బాటిల్స్‌ కాలువల్లో వేయరాదని ప్రజలకు తెలిపే విధంగా పర్యావరణ పరిరక్షణ అవగాహన బోర్డులను కలెక్టర్‌ డిల్లీరావు ఆవిష్కరించారు.
కార్యక్రమంలో హెచ్‌పిసిఎల్‌ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ జనల్‌ మేనేజర్‌ బెన్నీ థామస్‌, డిజియం రెబ్బా అబేంద్కర్‌, చీఫ్‌ మేనేజర్లు నక్కా విల్సన్‌, ఆదిత్య ఆనంద్‌, సీనియర్‌ మేనేజర్‌ బి.వి విష్ణువర్థన్‌ రెడ్డి, జిజిహెచ్‌ సుమరింటెండెంట్‌ డా.వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *