విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ తోటవారి వీధి నందు డివిజన్ ఇన్ ఛార్జ్ రామయనపు శ్రీనివాస్ తో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. కాలనీ పెద్దలతో సమావేశమై డివిజన్ లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు గురుంచి వారి సలహాలు సూచనలు తెలుసుకుని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు ఉకోటి రమేష్, కాలనీ ప్రెసిడెంట్ తోట ప్రసాద్,కాలనీ పెద్దలు నాంచారయ్య,ఎర్రమోతు శ్రీను, పిడుగు విజయ్, పల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News