Breaking News

సహిత విద్యా రిసోర్స్ పర్సన్స్ పోస్టుల భర్తీ కి దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న భవిత కేంద్రాలలో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్ పర్సన్స్ పోస్టులను తాత్కాలిక /ఒప్పంద ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. ఖాళీల వివరాలు:396 ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను http.apie.apcfss.in వెబ్ సైట్ ద్వారా రూ.100/- దరఖాస్తు రుసుము చెల్లించి తేది 04-09-2023 నుండి 18-09-2023 తేదీ 11.59 PM వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ / ఫిజికల్ దరఖాస్తులు స్వీకరించబడవు. వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు మరియు విద్యార్హత వివరాలను http.apie.apcfss.in వెబ్ సైట్ నందు ఉంచబడిన పూర్తి నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అభ్యర్థులకు మెరిట్ లిస్టు జాబితాకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నచో సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *