Breaking News

శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు నేటి గురువారం సాయంత్రం సమాచార మరియు వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని సేవించి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కుటుంబ సమేతంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సేవించి దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఏఈఓ సతీష్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, సహాయ బిసి సంక్షేమ అధికారి చంద్ర శేఖర్, తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *