-దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో స్వదేశీ రత్నం పెన్నులు ఉనికి అబ్బుర పరిచింది
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో ” రత్నం పెన్స్” సంస్థ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందని, రానున్న తరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
మంగళవారం కోటగుమ్మం సమీపంలోని ” రత్నం పెన్స్ ” గృహాన్ని సందర్శించి చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకున్నారు. అక్కడ రిజిస్టర్ లో తన భావాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రత్నం పెన్స్ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శించడం ద్వారా రాజమహేంద్రవరం ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకుని రావడం అభినందనీయం అన్నారు. కెవి రత్నం కుటుంబానికి ఇది దేవుడు ఇచ్చిన బహుమతిగా కలెక్టర్ అభివర్ణించారు. రాజమహేంద్రవరం నగరానికి రత్నం పెన్ సంస్థ ఒక మైలు రాయి గా నిలవాలని కోరుకున్నారు. భవిష్యత్ తరాలు ఈ సంప్రదాయాన్ని ఎప్పటికీ కొనసాగించాలని, దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని అభిలాష వ్యక్త పరిచారు. ఇటువంటి ప్రాంతాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా సందర్శించడం గౌరవంగాను, ప్రత్యేక అనుభూతికి లోనయ్యాను అని పేర్కొన్నారు. ఈపెన్ను ద్వారా తన చేతి రాత ఎంతో మెరుగు పండిందన్నారు. నేటి యువత బాల్ పెన్నులకు అలవాటు పడడం వల్ల చక్కటి చేతి వ్రాతకు దూరం అవ్వడం తో పాటు పర్యావరణ కాలుష్యము కూడా పెరిగిందన్నారు. ఇంకు పెన్నుల వినియోగం పై పిల్లల్లో తల్లితండ్రులు ప్రోత్సహించాలి అని అన్నారు.
మహాత్మా గాంధీ రత్నం పెన్స్ వ్యవస్థాపకులు కేవి రత్నం కు లేఖ: గోపాల రత్నం
మీరు శ్రీ కుమారప్ప ద్వారా పెన్ను పంపినందుకు ధన్యవాదములు దీనిని వాడి చూసాను బజారులో లభించే విదేశీకలాలకు ప్రత్యామ్నయంగా ఉందని జాతిపిత మహాత్మా గాంధీ.. 16.07.1935 లో శ్రీ కోసూరి వెంకట రత్నంకు లేఖ వ్రాశారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ ద్వారా వచ్చిన ప్రశంసలతో మన దేశ నాయకులు అందరూ రత్నం గారిని పెన్నులు తయారీ రంగం లో ప్రోత్సహిస్తూ వారు తయారు చేసిన పెన్నులను వాడేవారని ఆయన పేర్కొన్నారు. భారత దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో స్వదేశీ రత్నం పెన్స్ కి ప్రత్యేక స్ధానం ఉందని 3వ తరం ప్రతినిధి గోపాల రత్నం పేర్కొన్నారు. 1932 లో ప్రారంభించిన ఈ సంస్థ రెండో తరంలో వెంకట రమణ రత్నం ప్రస్తుతం మాతరం ఈరంగం లో ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భం గా రత్నం కుటుంబ సభ్యుల తో మాట్లాడి, పెన్నుల తయారీ విధానం తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా పరిశ్రమల అధికారి బి. వేంకటేశ్వర రావు, డి ఆర్ డి ఎ పిడి ఎస్. సుభాషిణి తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News