Breaking News

గ్రీన్‌ ఎనర్జీ వైపు అడుగులు వేద్దాం….

-విద్యుత్‌ వాహనాల వినియోగించి శబ్ద, వాతావరణ కాలుష్యాలను నివారిద్దాం…
-విద్యుత్‌ వాహనాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి..
-2030 నాటికి విద్యుత్‌ వాహనాలదే జోరు.
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్‌ వాహనాల వినియోగం వలన శబ్ద వాతావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు, అతి తక్కువ ఖర్చుతో వాహనాలను వినియోగించుకోవచ్చునని, వాహనాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌లో ఈనెల 13వ తేది వరకు నిర్వహించనున్న విద్యుత్‌ ద్విచక్ర వాహనాల ప్రదర్శనను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ఇంధన భద్రతను పెంచి శబ్ద వాతావారణ కాలుష్యాలను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ వాహనాల వినియోగానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాని పోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సులభ వాయిదాలపై వాహనాల కొనుగోలుకు బ్యాంకుల నుండి రుణాలను మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్‌ వాహనాల వినియోగం ఎంతో సులభతరమని అతి తక్కువ ఖర్చుతో నిర్వహణ చేసుకోగలుగుతారన్నారు. మామూలు ద్విచక్ర వాహనాలకు 100 రూపాయల ఖర్చు చేసి ఒక లీటర్‌ పెట్రోల్‌తో కేవలం 45 కిలో మీటర్లు మాత్రమే ప్రయాణించగలుగుతారని, 25 రూపాయల ఖర్చుతో విద్యుత్‌ వాహనాలనురీచార్జ్‌ చేసుకుని 100 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. ఇంధన ఖర్చులు బారంగా మారిన నేటి కాలంలో దిగువ మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేలా చార్జింగ్‌ సదుపాయాలతో రూపొందించిన విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు వినియోగించవలసిన అవసరం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2030 నాటికి పెట్రోల్‌ వాహన వినియోగాన్ని తగ్గించి విద్యుత్‌ వాహనాలను వినియోగాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు విద్యార్థులకు ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎంతో దోహదపడతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయని దీనిలో భాగంగా గ్రీన్‌ ఎనర్జీ వినియోగాన్ని పెంచే చర్యలను మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారని ఈ అంశంలో కూడా మన రాష్ట్రం ఎంతో ముందుదన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న స్పందన కార్యక్రమంరోజు జిల్లా అధికారులకు, ఉద్యోగులకు విద్యుత్‌ వాహనాలపై ప్రత్యేక ప్రదర్శన అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయనున్నట్లు కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
నెడ్‌క్యాప్‌ వైస్‌ చైర్మన్‌,మేనేజింగ్‌ డ్కెరెక్టర్‌ ఎస్‌. రమణారెడ్డి మాట్లాడుతూ, కాలుష్య రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. మన రాష్ట్రంలో సుమారు కోటి,30 లక్షల వాహనాలు ఉన్నాయని, వీటిలో అత్యధికంగా ద్విచక్రవాహనలేనని చెప్పారు. వీటి వినియోగం వల్ల లక్షల టన్నుల బొగ్గుపులుసు వాయువు వాతావరణంలో కలిసి, పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు. విద్యుత్‌ వాడకాల వినియోగం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాకుండా, రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, తద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా ఎంతో ఆదా అవుతుందని చెప్పారు. విద్యుత్‌ వాహనాల వినియోగం వలన ప్రజలకు అనేక రకమైన ప్రయోజనాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల విప్లవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ప్రజలను చైతన్యవంతులను చేసి విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విద్యుత్‌ వాహనాల కొనుగోలు చేసేందుకు తక్షణమే రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షకు పైగా విద్యుత్‌ ద్విచక్రవాహనాలు రిజిస్ట్రర్‌ చేసుకోవడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విద్యుత్‌ వాహనాలు ముద్దు.. పెట్రోల్‌ వాహనాలు వద్దు.., విద్యుత్‌ వాహనాలను వినియోగిద్దాం.. కాలుష్యాన్ని నివారిద్దాం.. నినాదాల ప్లేకార్డులను ప్రదర్శించి విద్యుత్‌ వాహనాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం నెడ్‌క్యాప్‌ అధికారులు ఉద్యోగులతో కలిసి స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడిపారు.
కార్యక్రమంలో నెడ్‌క్యాప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె. శ్రీనివాసరావు, డా. బిఆర్‌ అంబేద్కర్‌ ఒపెన్‌ యూనివర్సిటి స్పెషల్‌ ఆఫీసర్‌ డా వెలగ జోషి, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బుచ్చిరాజు, ధనలక్ష్మి బ్యాంక్‌ మేనేజర్‌ జి. సురేఖ, కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *