Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు చేపట్టండి…

-పోలీస్, మున్సిపల్, ట్రాన్స్ పోర్ట్, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి అధికారులతో ప్రత్యేక కమిటీ…
-ప్రమాద ప్రాంతాలుగా గుర్తించిన బ్లాక్ స్పాట్లను పునః తనిఖీ నిర్వహించండి…
-నగరంలో రోడ్లపై అక్రమ ఆక్రమణలు తొలిగించేలా నిరంతర పర్యవేక్షణ.
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలీస్, మున్సిపల్, ట్రాన్స్ పోర్ట్, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గతంలో ప్రమాద ప్రాంతాలుగా గుర్తించిన బ్లాక్ స్పాట్లను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి 15 రోజులల్లో ప్రమాదాలకు గల కారణాలు నివారణకు చేపట్టిన చర్యలపై నివేదికను సమర్పించాలని నగరంలో రోడ్ల వెంట అక్రమ ఆక్రమణలతో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై నిరంతరం పర్యవేక్షించి ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ ట్రాఫిక్ నియంత్రణపై గురువారం జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు నగరంలోని ఆయన విడిది కార్యాలయంలో పోలీస్, మున్సిపల్, ట్రాన్స్ పోర్ట్, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు రోడ్డు భద్రతా సమావేశాలను నిర్వహించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టి నప్పటికీ తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 29, జాతీయ రహదారి పరిధిలో 55, ఆర్ అండ్ బి పరిధిలోని 5 ప్రాంతాలతో కలిపి మొత్తం 89 ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మరో 22 చోట్ల తరచూ ప్రమాదాలు గురి అవుతున్న ”బ్లాక్ స్పాట్లుగా” గుర్తించడం జరిగిందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్లను పునః పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాలకు గురి అయ్యే ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్, జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారి, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ ఎం. పురేంద్రను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నియమించిన కమిటీ సభ్యులు బ్లాక్ స్పాట్లను పునః తనిఖీలు నిర్వహించి 15 రోజుల్లోపు నివేదికలు సమర్పించాలని ఆయన సూచించారు. విజయవాడ నగర పరిధిలో ప్రస్తుతం 24 ప్రాంతాల్లో సిగ్నల్ పాయింట్లు ఉన్నాయని మరో 14 చోట్ల సిగ్నల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రాంతాల్లో సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర పరిధిలో 105 బస్ స్టాఫ్ లు ఉన్నాయని బస్ స్టాప్ ల వద్ద బస్సు షెల్టర్ లు, ఫుట్ పాత్ , జిబ్రా లైన్స్ వంటి ఏర్పాట్లు లేని చోట సత్వరమే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించే హోర్డింగ్స్ ను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలలో వ్యాపారస్తులు రోడ్లు, ఫుట్ పాత్ లను ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహించడం వలన ట్రాఫిక్ ఇబ్బంధికి ముఖ్య కారణంగా గుర్తించడం జరిగిందన్నారు. నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, ట్రాన్స్ పోర్ట్ సిబ్బందితో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి అక్రమ ఆక్రమణల తొలగింపు వాహనంలో రోజుకొక రోడ్ లో గస్తీ తిరుగుతూ రోడ్లు, ఫుట్ పాత్ లపై అక్రమ ఆక్రమణలను తొలగిస్తే ట్రాఫిక్ రద్దీ నివారణలో సత్ఫలితాలు సాధించగలుగుతామని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. కళాశాలలు, పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయల వంటి రద్దీ ప్రాంతాల వద్ద వాహన దారులకు సూచించే సూచక బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ట్రాఫిక్, మున్సిపల్, డీఈవో, డి యం అండ్ హెచ్ ఓ తో కమిటీ ని ఏర్పాటు చేసి సూచికలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రత సమావేశాలను నిర్ణిత రోజుల్లో నిర్వహించి తీసుకున్న చర్యలపై రోడ్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి నివేదిక సమర్పించాలని రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్, డిసిపి ఎం. సత్తిబాబు, అడిషనల్ సిపి డి. ప్రసాద్, 2 ట్రాఫిక్ ఎసిపి జెవి. నారాయణ, డిటిసి ఎం. పురేంద్ర, నేషనల్ హైవే పిడి డివి. నారాయణ, ఆర్ అండ్ బి ఇఇ ఎన్. కృష్ణానాయక్, విఎంసి అడిషనల్ కమీషనర్ సత్యవతి, చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జివిజీఎస్వీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *