Breaking News

పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబందించిన సమస్యల పరిష్కారంపై నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామిలను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వరద ముంపు నుండి రక్షణ కల్పించేందుకు ప్రకాశం బ్యారేజ్‌ ఎగువ ప్రాంతాన రిటైనింగ్‌ వాల్‌ నిర్మించేందుకు 7 కోట్ల 3 లక్షల 50 వేలు, రెల్లి కులస్తులకు కమ్యూనిటీ హాల్‌ నిర్మించేందుకు 50 లక్షలు, మోతి మసీద్‌ షాదిఖానా నిర్మాణానికి కోటి రూపాయలు, హజరత్‌ సయ్యద్‌ అలీ దర్గా అభివృద్ధికి కోటి రూపాయలు, విద్యాధరపురం షాదిఖానా పున:నిర్మాణానికి 91 లక్షల 30 వేలు, మీనార్‌ మసీద్‌ అభివృద్ధికి 27 లక్షలు, నూర్‌ మసీద్‌ ప్రాంగణంలో మదరసా భవనం నిర్మాణానికి 31 లక్షల 80 వేలు అంచనాను రూపొందించడం జరిగిందని ఆయా పనులను త్వరితగిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దళిత వర్గాలకు చెందిన వారు మృతిచెందిన సమయంలో బౌతిక కాయాలకు ఖననం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని దళిత శ్మశాన వాటికకు అనువైన స్థలాన్ని కేటాయించవలసిందిగా కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనితో పాటు కాపులకు సంక్షేమ భవనాన్ని నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించి ముఖ్యమంత్రి ఇచ్చిన హామిలను అచరణలోకి తీసుకురావాలని శాసనసభ్యులు అన్నారు.
సమావేశలో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *