Breaking News

నీతి ఆయోగ్‌ల పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ఫెలో (నీతి ఆయోగ్‌)ల పోస్టుల భర్తీ కొరకు ఈనెల 12వ తేది లోపు ధరఖాస్తులు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆర్థ గణాంక అధికారి వారి ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలలో ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ఫెలో (నీతి ఆయోగ్‌)లో పనిచేసేందుకు తాత్కాలిక ప్రాతిపదికన రెండు పోస్టుల భర్తీకు ఈనెల 12వ తేదిలోపు ధరఖాస్తులను స్వీకరిస్తున్నారన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ అర్హతతో డేటా అనాలసిస్‌, ప్రెజెంటేషన్‌ స్కిల్‌, సోషల్‌మీడియా తదితరాలపై పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. స్టైఫండ్‌ నెలకు 55 వేల రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ ధరఖాస్తులను వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ కార్యాలయం, కలెక్టరేట్‌ కంపౌండ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా చిరునామాకు అందజేయవలసి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు ntr.ap.gov.in వెబ్‌ సైట్‌ను సంప్రదించవచ్చునని కలెక్టర్‌ డిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *