అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారము మంగళ గిరి కార్యాలయం నుండి చేవూరి హరికిరణ్ I.A.S., ప్రత్యేక వ్యవసాయ కమీషనర్వారు రాష్ట్రములోని 26 జిల్లాల వ్యవసాయ అధికారులు, సహాయవ్యవసాయ సంచాలకులు మరియు మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఖరీఫ్ సీజన్2023 సెప్టెంబర్ నెలతో ముగిసినందున వ్యవసాయ అధికారులందరూ ఈ – క్రాప్ ద్వారా మిగిలిన పంట వివరముల నమోదు, ఈ కే వై సి మరియు ఈ – క్రాప్ పై వాస్తవికతను ద్రువీకరించాటానికి సీనియర్ అధికారులు క్షేత్రసందర్సనను అత్యంత ప్రాధాన్యంశముగా పరిగణించి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ నెల 10 కంతా పూర్తి చేయాలని ఆదేశించారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 97% ఈ క్రాప్ నమోదు పూర్తి అయిందని మరియు ఈ కే వై సి 70% మంది రైతులు పూర్తి చేసారని తెలిపారు. కాబట్టి మిగిలిన 30% మంది రైతులు ఈ నెల 10 కంతా పూర్తి చేయాలని కోరారు.
ఈ- క్రాప్ నమోదు ముగిసిన తర్వాత 15-10-2023 కంతా ఆర్ బీ కే లలో సామాజిక తనిఖీ నిర్వహించాలని తెలిపారు.గ్రామ సభలో ముసాయిదా జాబితా లోని ప్రతి రైతు పంట వివరములను విత్తిన తేదీ తో సహా చదివి ధ్రువీకరించాలని తెలిపారు. సామాజిక తనిఖీ అనంతరం తుది జాబితా ను 20-10-2023 కంతా ఆర్ బీ కే లలో ప్రదర్శించాలని ఆదేశించారు.
పి.ఎం.కిసాన్ యొక్క 15వ విడత (ఆగష్టు – నవంబర్ 2023) లభ్ది ను అక్టోబర్ 2023 రెండవ పక్షము లో విడుదల చేసే అవకాశం ఉన్నందున, విడుదల చేసే సొమ్ము రైతుల ఖాతాలో సరిగాజమ కావాలంటే ప్రధానంగా మూడు అంశములను ఆధార్ తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు మరియు ఈ కే వై సి తప్పనిసరి కాబట్టి వాటిని సరిచూసుకోవాలని, ఈ నెల 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.పి.ఎం.కిసాన్ లో స్వీయ ధృవీకరణ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ఆ సమాచారాన్నిక్రమం తప్పకుండా పరిశీలించి పెండింగ్ జాబితాను తగ్గించాలని కోరారు.
రైతుభరోసాకేంద్రాలలో యూరియాఅమ్మకాలకు సంబంధించి జిల్లాల వారిగా సమీక్ష నిర్వహించారు. గోడౌన్ లను వ్యవసాయ శాఖ కు ఇచ్చిన మరియు ఇవ్వని సచివాలయాల జాబితాను పంపించాలని తెలిపారు. యూరియా ఎరువు వాడకం వ్యవసాయేతర అవరసాలకు తరలిపోకుండా యూరియా విక్రయాలపై నిఘా పెట్టాలని, ప్రతి మండలం లో నెల వారీ అత్యధిక యూరియా అమ్మకాలు జరుపు తున్నకొనుగోలు దారులను, డీలర్లను అధికారులు పరిశీలించి లోటుపాట్ల పై చర్యానివేదికను పంపించాలని ఆదేశించారు.
కిసాన్ డ్రోన్ల గురించి ప్రస్తావిస్తూ ప్రతి మండలానికి కిసాన్ డ్రోన్ల పైలట్ ల శిక్షణ నిమిత్తం పూర్వపు మార్గదర్శకాలను సవరణ చేసి సులభతరం చేసారని, పాస్ పోర్ట్ ఉండాలనే నిబంధనను తొలగించారని తెలిపారు. ఆర్ బీ కే, పైలట్ , సిహెచ్.సి ముగ్గురు ఒప్పందం తో అంగీకారపత్రం చేసుకోవాలని తెలిపారు.
గ్యాప్ పొలంబడులనుఎపిఎస్ఓపిసిఎ తో రైతుఉత్పత్తి సంఘాలు రిజిస్ట్రేషన్ లను వేగవంతం చేయాలని తెలిపారు.
Prajavartha Online Telugu News