Breaking News

వయోవృద్దుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న జగనన్న ప్రభుత్వం

-రాష్ట్ర మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతులు&వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉష శ్రీచరణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వయో వృద్దుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తున్నదని, శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వృద్దాప్య పింఛన్ల పెంపుకు సంబందించిన ఫైలుపైనే తొలి సంతకం చేయడం ఇందుకు నిదర్శనమని రాష్ట్ర మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతులు & వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉష శ్రీచరణ్ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి వయో వృద్దుల మండలి తొలి సమావేశం ఆమె అధ్యక్షతన వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం జరిగింది. అన్ని జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి వయో వృద్దుల మండళ్ల అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వయో వృద్దులు అందరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో వైఎస్సార్ పింఛను కానుక క్రింద ప్రతి నెలా రూ.2,750/- వారి గడప వద్దే ఒకటో తేదీ కల్లా అందజేయడం జరుగుచున్నదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆ పింఛను సొమ్మును వచ్చే ఏడాది జనవరి నుండి రూ.3,000/- లకు పెంచనున్నట్లు ఆమె తెలిపారు. ఈ పధకం క్రింద దాదాపు 39,92,333 మంది వయో వృద్దులకు ప్రతి నెలా రూ.1,070.61 కోట్ల సొమ్మును పింఛనుగా అందజేయడం జరుగుచున్నదన్నారు. తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో పాటు, సికిల్ సెల్ అనీమియా, తలసెమియా తదితర వ్యాధులతో బాధపడేవారికి ప్రతి నెలా రూ.10 వేలు మరియు కిడ్నీ, లివర్, గుండె, పక్షవాతం, బోధకాలు తదితర వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెలా రూ.5 వేల పింఛను అందజేయడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద దాదాపు 3 వేల వ్యాధులకు పైబడి ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఉచిత కార్పొరేట్ వైద్యసేవలు అందించడమే కాకుండా, ప్రస్తుతం జగనన్న ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహిస్తూ వయో వృద్దులకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేలను అందజేయడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. ఆర్.టి.సి. బస్సుల్లో ప్రయాణించే వయోవృద్దులకు రవాణా చార్జీల్లో 25 శాతం రాయితీని కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మొత్తం 71 వృద్దాశ్రమాలతో పాటు మరో 118 వృద్దాశ్రమాలు పలు సొసైటీలు, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే రాష్ట్రంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు మరియు ఎన్.టి.ఆర్. జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో వృద్దాశ్రమాలను నిర్వహించడం జరుగుచున్నదని, ఆ ఐదు జిల్లాల్లో కూడా ప్రభుత్వ పరంగా వృద్దాశ్రమాలను ఏర్పాటు చేసే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు.

తల్లిదండ్రులు, వృద్దుల సంక్షేమం మరియు నిర్వహణకు సంబందించి కేంద్ర ప్రభుత్వం 2007 సంవత్సరంలో రూపొందించిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా 2011 లో మార్గదర్శకాలను, నియమ నిబంధనలకు రూపొందించడం జరిగిందని ఆమె తెలిపారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది మే మాసంలో రాష్ట్ర స్థాయిలో వయోవృద్దుల రాష్ట్ర మండలితో పాటు అన్ని జిల్లాల్లో కూడా మండళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 77 సబ్ డివిజన్లలో ట్రిబ్యునళ్లును, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన అప్పిల్లేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు, వృద్దుల సంక్షేమం మరియు నిర్వహణకు సంబందించిన సమస్యలపై ఆ ట్రిబ్యునళ్లలో అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. ఈ ట్రిబ్యునళ్ల ద్వారా తల్లిదండ్రులు, వృద్దుల జీవితం, ఆస్తులకు సంబందించి రక్షణ కల్పించడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. వయోవృద్దుల సంక్షేమానికై ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై మరియు ఈ ట్రిబ్యునళ్లను చక్కగా సద్వినియోగం చేసుకునేలా వృద్దులు, తల్లితండ్రుల్లో చక్కని ఆవగాహన కల్పించాల్సిన బాధ్యత జిల్లా స్థాయి వయో వృద్దుల మండళ్లపై ఉందని ఆమె పేర్కొన్నారు.

ఈ సమావేశ ప్రారంభంలో రాష్ట్ర మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతులు & వయో వృద్దుల సంక్షేమ శాఖ ప్రిన్పిఫల్ సెక్రటరీ జి.జయలక్ష్మీ మాట్లాడుతూ ప్రతి ఏడాది అక్టోబరు 1 న ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుచున్నదని, ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేడు రాష్ట్ర స్థాయి వయో వృద్దుల మండలి తొలి సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు, వృద్దుల సంక్షేమం మరియు నిర్వహణకు సంబందించి కేంద్ర ప్రభుత్వం 2007 సంవత్సరంలో రూపొందించిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో 2011 సంవత్సరంలో రూపొందించిన మార్గదర్శకాలను, నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని సబ్ డివిజన్లలోను ట్రిబ్యునళ్లను, జిల్లా స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని తల్లిదండ్రులు, వయోవృద్దులు అందరూ చక్కగా సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.

రాష్ట్ర మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతులు & వయో వృద్దుల సంక్షేమ శాఖ సంచాలకులు బి.రవిప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర చట్టాలకు అనుగుణంగా తల్లిదండ్రులు, వృద్దుల సంక్షేమం మరియు నిర్వహణకు సంబందించి ఈ ఏడాది మే మాసంలో రాష్ట్ర స్థాయిలో వయోవృద్దుల రాష్ట్ర మండలితో పాటు అన్ని జిల్లాల్లో కూడా మండళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 77 సబ్ డివిజన్లలో ఏర్పాటు చేసిన నిర్వహణ ట్రిబ్యునళ్లకు ఇప్పటి వరకూ మొత్తం 2,158 క్లైమ్ లు అందాయని, వాటిలో 1,761 క్లైమ్ లను పరిష్కరించడం జరిగిందన్నారు. అప్పిల్లేట్ ట్రిబ్యునళ్లకు ఇప్పటి వరకూ అందిన 101 క్లైమ్ లలో 78 క్లైమ్ లను పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న పలు జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి వయో వృద్దుల మండళ్ల అధ్యక్షులు మాట్లాడుతూ ఈ చట్టం అమల్లో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువస్తూ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర స్థాయి వయో వృద్దుల మండలిలో సభ్యులైన వైద్య, ఆరోగ్యం, హోమ్, ఫైనాన్సు, లా, పంచాయితీ రాజ్, రెవిన్యూ, రవాణ, రోడ్లు&భవనాల శాఖకు చెందిన సెక్రటరీ స్థాయి అధికారులు పాల్గొని ఆయా శాఖల పరంగా వయో వృద్దులకు అందజేస్తున్న పథకాలను, కార్యక్రమాలను జిల్లా స్థాయి వయో వృద్దుల మండళ్ల అధ్యక్షులకు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *