Breaking News

అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పై ప్రత్యేక సమీక్ష

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పోరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీల పరిష్కారం పై వార్డ్ ల వారిగా యాక్షన్ ఇవ్వాలని విభాగాదిపతులకు నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో నగరంలోని కార్పొరేటర్లతో వార్డ్ ల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై ఉంటారని, వారు గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కారనికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు వార్డ్ ల వారిగా కార్పొరేటర్లు అందించిన అర్జీలు, వాటి పరిష్కారం పై నివేదిక ఇవ్వాలని ఆయా విభాగాదిపతులను ఆదేశించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం, నగర సమగ్రాభివ్రుద్ది జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం స్పందన, ప్రతి రోజు వార్డ్ సచివాలయాల్లో మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు ప్రజా స్పందన నిర్వహిస్తున్నామన్నారు. వార్డ్ ల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పై కార్పొరేటర్లు కూడా కమిషనర్ తో చర్చించడానికి ప్రత్యేక సమయం కావాలని కోరి ఉన్నందున ప్రతి శుక్రవారం కార్పొరేటర్లు తమ వార్డ్ సంబందించిన అంశాలు చర్చించేందుకు అవకాశం ఉందన్నారు. మిగిలిన రోజుల్లో కూడా కార్పొరేటర్లకు అందుబాటులో ఉంటామని, వాట్స్ అప్ లో తెలిపినా కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేటర్ల నుండి అందే అర్జీలు, ఫిర్యాదులు, ప్రతిపాదనలను క్రమ పద్దతిలో రికార్డ్ చేసి, తదుపరి చర్యలు కూడా వారికి తెలిపేలా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *