Breaking News

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు కూడా ఉన్నత వైద్యం ఇంటి వద్దకే అందుతుందని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రాజీవ్ గాంధి నగర్ లో నూతనంగా నిర్మాణం చేసిన వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్నినగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి, ఎఎల్ఏ మహ్మద్ ముస్తఫాలతో కలిసి ప్రారంభించి, జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందదని, నాడు నేడు ద్వారా ఆయా రంగాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతుందన్నారు. వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను నూతనంగా మంజూరు చేయడం ద్వారా పేదలకు అందుబాటులోకి వైద్య సేవలు వచ్చాయన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పక్కా ప్రణాళిక మేరకు ముందుగా ఇంటింటిలో ప్రజల ఆరోగ్య స్తితిగతులను పరిశీలించడం, వారి వివరాలు నమోదు చేసుసుకోవడం, అనారోగ్యంగా ఉన్న వారిని క్యాంప్ కి తీసుకొచ్చి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పేదల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తుందన్నారు. వైద్య పరీక్షలతో పాటుగా అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన చికిత్స, మందులు అందించడం జరుగుతుందన్నారు. కంటికి సంబందించిన వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాంప్ ల్లో విధులు కేటాయించబడిన సిబ్బంది ఓర్పుతో ప్రజలకు రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు, ఫార్మశీ వివరాలు తెలియచేయాలన్నారు.
మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సుధీర్ఘ పాదయాత్రలో పేదల ఇబ్బందులు స్వయంగా గమనించి, అధికారంలోకి రాగానే నవరత్నాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ప్రభుత్వం నుండి లబ్ది పొందిన వారు ఒక్కరైనా ఉంటారని, కుల,మత, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రాతిపదికగా వార్డ్ సచివాలయాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్కరికి వరం వంటిదన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పేదల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తుందని, ఏఎన్ఎం, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అనారోగ్య బాదితులను గుర్తించి క్యాంప్ గురించి అవగాహన కల్గించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్యం సంపూర్ణంగా అందాలనే ఉన్నత లక్ష్యంతో జగనన్న సురక్ష అమలు చేస్తుందని, నగరంలోని 29 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో క్యాంప్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. క్యాంప్ ల్లో జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ తో పాటుగా ఇద్దరు ఎంబిబిఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకొని, అవసరమైతే అందుబాటులోని హాస్పిటల్ ల్లో చేర్చి చికిత్స అందిస్తారని, ఆరోగ్య శ్రీ ద్వారా కూడా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తారని తెలిపారు.
ఎంఎల్ఏ మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన తెచ్చిన విధంగా, ప్రజల వద్దకు వైద్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెచ్చారన్నారు. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ ఉందని, అందుకే ఆరోగ్యశ్రీ లో కూడా గతం కంటే ఎక్కువ వ్యాధులకు చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. నగరంలో 29 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందని, జగనన్న సురక్ష క్యాంప్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, కార్పొరేటర్ మల్లవరపు రమ్య, నాయకులు నూరి ఫాతిమా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మెడికల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *