Breaking News

ఈవీఎంలు, వివి ప్యాట్స్‌ ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సి)కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈవీఎంలు, వివి ప్యాట్స్‌ ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సి)కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు. సచివాయలం ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం ఈవీఎంలు, వివి ప్యాట్స్‌ ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్సి)పై సన్నద్ధత, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి నవంబర్‌ 05 వ తేదీ వరకు 20 రోజులపాటు ఈవీఎంలు, వివి ప్యాట్స్‌ ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సి)కు అన్ని ఏర్పాట్లు చేసి సిద్దంగా ఉన్నామని రోజుకు 285 యూనిట్ల చొప్పున 20 రోజులపాటు 5,700 పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఈ ప్రక్రియకు సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్సి)లో ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటిస్తూ ఎటువంటి తప్పులు దొర్లకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈవీఎం గోడౌన్లలో నిర్వహించే ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ ప్రక్రియకు బ్యారికేడిరగ్‌ నిర్వహించి పటిష్ట బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు, వెబ్‌ క్యాస్టింగ్‌ చేస్తున్నామన్నారు. ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు విద్యుత్‌ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాటు చేశామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులకు ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌కు సంబంధించిన సమాచారం ఇప్పటికే అందించడం జరిగిందని కలెక్టర్‌ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ సిహెచ్‌.దుర్గాప్రసాద్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *