Breaking News

శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను, అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను, అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించి అధికారులకు సిబ్బిందికి తగు సూచనలు చేయాలని డిప్యూటి సియం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఈనెల15వ తేది నుండి 23 తేది వరకు ఇంద్రకీలాధిపై నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, నగరపోలీస్‌ కమీషనర్‌ కాంతి రానా టాటా, ఆలయ ఇవో కె.ఎస్‌ రామరావు నగరంలోని కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 15వ తేది ఆదివారం నుండి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు లక్షలాధి మంది భక్తులు అమ్మవారి దర్శించుకోనున్నారన్నారు. ప్రతి రోజు దాదాపు 50 నుండి 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శిస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసి సిద్దం చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, లోటుపాట్లను సరిదిద్ది ఈ ఏడాది మరింత పటిష్టింగా ఏర్పాట్లు ఉండేలా శాఖల సమన్వయంతో ఉత్సవాలను నిర్వహించేలా అధికారులు పనిచేయాలన్నారు. ఈనెల 20వ తేది శుక్రవారం మూల నక్షత్రం, సరస్వతీదేవి అవతారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారికి మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న దృష్ట్యా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఉండేలా అధికారులు చూడాలన్నారు. దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునే విఐపిలు, వివిఐపిలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారిని దర్శించుకునే వయోవృద్ధులు, విభిన్నప్రతిభావంతులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఘాట్‌ రోడ్డులో భక్తులను తరలించే వాహనాలు తగిన జాగ్రతలు తీసుకునేలా వాహనా డ్రైవర్లకు ముందుగానే అవగాహన కల్పించాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్‌లలో ప్రత్యేక దర్శన టిక్కెట్ల విక్రయం కల్పించాలని, క్యూలైన్‌లలో త్రాగునీటి సరఫరాకు వాటర్‌ ప్యాకెట్లను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు లడ్డు ప్రసాదములు అందుబాటులో ఉండేలా 12 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేసినప్పటికి అవసరమైతే అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు కూడా సిద్దంగా ఉండాలన్నారు. ఎటువంటి సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు మోడల్‌ గేస్ట్‌ హౌస్‌ వద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌, దేవాదాయ, తదితర శాఖల అధికారులతో నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లను చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, నగరపోలీస్‌ కమీషనర్‌ కాంతి రానా టాటా, డిసిపి విశాల్‌గున్ని, ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె ఎస్‌ రామరావు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ కె. రాంబాబు, ఏసిపి హనుమంతరావు, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *