విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన (మంగళవారం) ఉదయం 10 గంటలకు పోరంకి లోని వరుణ్ నెక్సా షోరూమ్ నందు “మినీ జాబ్ మేళా” కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపి.యస్.యస్.డి.సి మరియు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎస్ .శ్రీనివాసరావు మరియు డి . విక్టర్ బాబు తెలిపారు. ఈ మినీ జాబ్ మేళాలో, వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో గల వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.కావున, జిల్లాలోని 18 సం|| నుండి 28 సం|| ల మధ్య గల 10వ తరగతి, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమా మరియు ఏదైన డిగ్రీ పూర్తిచేసిన యువతీ యువకులు ఇంటర్వ్యూలకు తమ బయోడేటా, సరిఫికేట్స్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డ్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు. ఇంటర్వ్యూ లలో ఎంపిక అయినా అభ్యర్థులకు నెలకు 11,000/- నుండి అనుభవాన్ని బట్టి 20,000 ల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని, జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగ పరచుకోవాలని వారు కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.మరిన్ని వివరాలకు 79813 68429 నందు సంప్రదించగలరు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News