విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 15వ తేది నుండి 23వ తేది వరకు ఇంద్రకీలాధిపై నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి విచ్చేసే మంత్రులు, న్యాయమూర్తులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వంటి ప్రోటోకాల్ వర్తించే అత్యంత ప్రముఖులు (వివిఐపి) వారి వాహన పాస్‌ల కొరకు ముందుగానే పోలీస్ కమీషనర్ వారికి సమాచారం అందించి వారి వద్ద నుండి వాహన పాస్‌లను పొందవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు తెలిపారు. అలాగే ప్రముఖులు (విఐపి)లకు సంబంధించి భవానిఘాట్, కలెక్టరేట్, స్టేట్ గెస్ట్ హౌస్ నందు దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో విఐపిలను వారికి వర్తించే మార్గదర్శకాలకు పరిశీలించి అమ్మవారి దర్శనానికి ప్రోటోకాల్ వాహనాలలో తీసుకువెళ్లి దర్శనానంతరం తిరిగి తీసుకువచ్చేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నడవలేని, చూడలేని స్థితిలో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు భవానిఘాట్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద దేవస్థానానికి సంబంధించిన ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి కొండపైన వారి సౌకర్యార్థం ట్రై సైకిళ్ళు, వాలంటీర్ల సేవలను సిద్దంగా ఉంచేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొనే ఉభయదాతల సౌకర్యార్థం గాంధీజీ మున్సిపల్ హైస్కూల్,భవానిఘాట్ వద్ద దేవస్థానం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిఐపిలు, విఐపిలు, విభిన్నప్రతిభావంతులు, భక్తులు వారికి కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుని దసరా మహోత్సవాలు విజయవంతానికి సహకారించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News